టీఆర్‌ఎస్‌లో చేరికల జోష్..

Sat,March 23, 2019 11:48 PM

భీంపూర్ : ఇప్పటికే తొంభై శాతం గులాబీ గ్రామాలుగా ఉన్న తాంసి, భీంపూర్ మండలాల్లో అక్కడక్కడా మిగిలిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు, సర్పంచులు శనివారం భీంపూర్ మండలం నిపానిలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీ అభ్యర్థి గొడాం నగేశ్, ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, డీడీసీ చైర్మన్ లోకా భూమారెడ్డి, రైతు సమితి అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి సమక్షంలో గులాబీ కండువా కప్పుకుని టీఆర్‌ఎస్‌లో చేరారు. తలమడుగు మండలంలోని కాంగ్రెస్ సర్పంచులు 11 మంది, నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరారు. టీఆర్‌ఎస్‌లోకి వచ్చిన ప్రముఖుల్లో పెందూర్ లక్ష్మణ్, సంజీవ్‌రెడ్డి, నారాయణరెడ్డి తదితరులున్నారు.

పార్టీలోకి కొత్త పంచాయతీల ఆదివాసీ సర్పంచులు..
భీంపూర్ మండలం టేకిడిరాంపూర్, కరణ్‌వాడి, ఇందూర్‌పల్లి, కైర్‌గూడ, గొల్లగడ్, మర్కాగూడ, భగవాన్‌పురా సర్పంచులతో పాటు గుబ్‌డిపల్లి సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామస్తులంతా టీఆర్‌ఎస్‌లో చేరారు. కరణ్‌వాడి సర్పంచ్, భర్త గెడాం ఇదివరకు బీజేపీలో ఉండగా ఇప్పుడు టీఆర్‌ఎస్‌లో చేరారు. తాంసి మండలం కప్పర్ల, తలమడుగు మండలం కుచ్‌లాపూర్ యువత సుమారు 200 మంది టీఆర్‌ఎస్‌లో చేరారు.

టీఆర్‌ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం..
ఎంపీ ఎన్నికల నేపథ్యంలో టీఆర్‌ఎస్‌లోకి భారీగా చేరడంతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి నగేశ్, ఎమ్మెల్యే బాపురావు, డీడీసీ చైర్మన్ లోక భూమారెడ్డితో పాటు మండల కన్వీనర్లు, టీఆర్‌ఎస్ శ్రేణుల్లో హర్షం వ్యక్తమైంది. నాయకులు, కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం కనిపించింది. ఎంపీగా ఈ మండలాల్లో అభివృద్ధి చేసిన గొడాం నగేశ్‌కు తిరిగి టీఆర్‌ఎస్ టికెట్ రావడంతో శ్రేణుల్లో ఆనందం కనిపించింది. తాంసి, భీంపూర్, తలమడుగు మండలాల టీఆర్‌ఎస్ కన్వీనర్లు కృష్ణ, సంజీవ్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, రైతు సమితి అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, నాయకులు తాటిపెల్లి రాజు, గడ్డం లస్మన్న, జి.నరేందర్, శ్రీధర్‌రెడ్డి, గ్రామాల టీఆర్‌ఎస్ పార్టీ బాధ్యుల సమష్టి కృషితో కాంగ్రెస్, బీజేపీ నుంచి టీఆర్‌ఎస్‌లోకి చేరికలు జరిగాయి.

బోథ్, నేరడిగొండకు చెందిన నాయకులు..
బోథ్, నమస్తే తెలంగాణ : బోథ్, నేరడిగొండ మండలాలకు చెందిన సీనియర్ టీడీపీ నాయకులు శనివారం సాయంత్రం బోథ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి సీహెచ్ సత్యనారాయణ, జిల్లా జనరల్ సెక్రెటరీ ఎస్‌కే అబూద్, బోథ్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మెన్ రఫీ అహ్మద్, రెండు మండలాల పార్టీ మాజీ కన్వీనర్లు పి రాజేశ్వర్‌రెడ్డి, పాల శంకర్, షేక్ చాంద్ పాషా తదితరులు పార్టీలో చేరారు. రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి గొడాం నగేశ్, డీడీసీ చైర్మెన్ లోక భూమారెడ్డి, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.

టీఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్ నాయకులు..
ఇచ్చోడ : మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు బత్తుల అశోక్‌తో పాటు సీనియర్ నాయకులు చెన్నాల గౌతం రెడ్డి, బాబా (టైలర్), బజార్‌హత్నూర్ మండలం గిర్నూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు శనివారం టీఆర్‌ఎస్‌లో చేరారు. స్థానిక షార్ఫ్ గార్డెన్‌లో నిర్వహించిన నాలుగు మండలాల టీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమక్షంలో గులాబీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరిన నాయకులందరికీ పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు.

54
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles