ఎమ్మెల్సీ పోలింగ్ ప్రశాంతం

Fri,March 22, 2019 11:55 PM

- మందకొడిగా ప్రారంభమై.. వేగం పుంజుకుని..
- ముఖం చాటేసిన పట్టభద్రులు.. ఉత్సాహం చూపిన ఉపాధ్యాయులు
- ఉపాధ్యాయ నియోజకవర్గానికి 80.63 శాతం పోలింగ్
- పట్టభద్రులు నియోజకవర్గానికి 57.28 శాతమే..


ఆదిలాబాద్ / నమస్తే తెలంగాణ ప్రతినిధి : జిల్లాలో శుక్రవారం ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. జిల్లావ్యాప్తంగా మొత్తం 20 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయ నియోజకవర్గానికి 80.63 శాతం పోలింగ్ నమోదుకాగా, పట్టభద్రుల నియోజకవర్గానికి 57.28 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. రెండు నియోజకవర్గాలకుగాను మందకొడిగా ప్రారంభమైన పోలింగ్ క్రమంగా వేగం పుంజుకుంది. జిల్లావ్యాప్తంగా 7,789 మంది పట్టభద్రులు, 1,554 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉండగా 4,462 మంది పట్టభద్రులు,1,253 మంది ఉపాధ్యాయ ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. పట్టణంలోని పలు పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ దివ్య పరిశీలించారు.

జిల్లా వ్యాప్తంగా శుక్రవారం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల పో లింగ్ ప్రశాతంగా ముగిసింది. జిల్లా వ్యాప్తంగా 20 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం ఎనిమిది గంటలకు రెండు నియోజకవర్గాల పోలింగ్ ప్రారంభం కాగా మొదటి రెండు గంటలు పది గంటల వరకు ఉపాధ్యాయ నియోజకవర్గానికి 11.69 శాతం పోలింగ్, పట్టభద్రుల నియోజవర్గానికి 8.9 శాతం పోలింగ్ నమోదైంది. 12 గంటలకు ఉపాధ్యాయుల నియోజకవర్గానికి 31.06 శాతం, పట్టభద్రుల నియోజకవర్గానికి 27.44 శాతం, మధ్యాహ్నం రెండు గంటలకు ఉపాధ్యాయ నియోజకవర్గానికి 62.51 శాతం, పట్టభద్రుల నియోజకవర్గానికి 43.89 శాతం పోలింగ్ నమోదైంది. పట్టభద్రుల పోలింగ్ శాతం 57.28 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం గ్రాడ్యూయేట్ ఓట్లు 7789 ఉండగా 4462 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో 3444 మంది పురుషులు, 1018 మంది మహిళలు ఉన్నారు. ఉపాధ్యాయ ఎన్నికలకు గాను 80.63 పోలింగ్ శాతం నమోదైంది. 1554 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉండగా 1253 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో పురుషులు 930 మంది, మహిళలు 323 మంది ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్బంగా సెలవు ప్రకటించడంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పట్టభద్రులు ఉత్సాహంగా ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఎంపీ నగేశ్ బజార్‌హత్నూర్‌లో ఓటు వేయగా మున్సిపల్ చైర్‌పర్సన్ రంగినేని మనీషా ఆదిలాబాద్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లా కేంద్రంలోని పలు కేంద్రాల్లో ఉపాధ్యాయ, పట్టభద్ర ఓటర్లు బారులు తీరు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తొలిసారి ఓటు హక్కును వినియోగించుకుంటున్న యువతీ, యువకులు ఓటు వేసేందుకు ఆసక్తి చూపారు. కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి 17 మంది పోటీలో ఉండగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి ఏడుగురు పోటీ పడుతున్నారు. కలెక్టర్ దివ్య, జిల్లా రెవెన్యూ అధికారి నటరాజ్, ఆర్టీవో సూర్యనారాయణ పోలింగ్ కేంద్రాలను పరిశీలించి ఓటింగ్ సరళిని అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఎస్పీ కార్యాలయం కంట్రోల్ రూం నుంచి బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. ఈ నెల 26న కరీంనగర్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగనుంది.

ఓటింగ్ ఆసక్తి చూపని పట్టభద్రులు
జిల్లాలో శుక్రవారం జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు గ్రాడ్యుయేట్లు ఓటు వేసేందుకు అంతగా ఆసక్తి చూపలేదు. జిల్లా వ్యాప్తంగా 7789మంది పట్టభద్రులు ఉండగా.. 4462మంది మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పలు కేంద్రాల్లో 50 కంటే తక్కువ శాతం పోలింగ్ నమోదైంది. గుడి హత్నూర్‌లో ఎక్కువగా 71శాతం పోలింగ్ నమోదు కా గా.. తాంసిలో 35.79శాతం పోలింగ్ రికార్డయింది. జి ల్లా కేంద్రంలో ఓటు వేసేందుకు పట్టభద్రులు ఆసక్తి క న బర్చారు. పట్టణంలో ఏర్పాటు చేసిన ఆరు కేంద్రాల్లో 50-67శాతం పోలింగ్ నమోదైంది. ఏజెన్సీ ప్రాంతమైన ఉట్నూర్‌లో 65శాతం పోలింగ్ రికార్డు అయింది. ఈ ఎన్నికల్లో బరిలో ఉన్న అభ్యర్థులు తమకు ఓటు వేయాలని ప్రచారం నిర్వహించిన గ్రాడ్యుయేట్లు మాత్రం అంతగా ఆసక్తి చూపలేదు.

పోలింగ్ కేంద్రాలు పరిశీలించిన కలెక్టర్
ఆదిలాబాద్ అర్బన్, నమస్తే తెలంగాణ : అందరి సహకారంతో ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించామని కలెక్టర్ దివ్యదేవరాజన్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని పలు పోలింగ్ బూత్‌లను సందర్శించారు. ఈ సందర్భం గా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల సిబ్బంది పోలీసులు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేశారని కొనియాడారు. అసెంబ్లీ ఎన్నికలను స్ఫూర్తిగా తీసుకొని ఎమ్మెల్సీ ఎన్నికలను విజయవంతంగా ముగించామన్నారు. ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలను చేపట్టామని చెప్పారు. ఎన్నికల నియమావళిపై ఎన్నికల అధికారులకు శిక్షణను ఇచ్చామని తెలిపారు. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఓటర్లు తమ ఓటు హక్కును నమోదు చేసుకున్నారని చెప్పారు. ఈ ఎన్నికలను సూర్తిగా తీసుకొని వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా నీతిమంతమైన ఓటు హక్కు వినియోగించుకోవాలని ఓటర్లకు సూచించారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగవద్దన్నారు. కలెక్టర్ వెంట డీఆర్వో నటరాజన్, ఆర్డీవో సూర్యనారాయణ, రెవెన్యూ అధికారులు ఉన్నారు.

114
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles