టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యం

Fri,March 22, 2019 11:49 PM

బజార్‌హత్నూర్ : టీఆర్‌ఎస్ ప్రభుత్వంతోనే రాష్ట్ర ఆభివృద్ధి సాధ్యం అని ఆదిలాబాద్ టీఆర్‌ఎస్ పార్టీ ఎంపీ ఆభ్యర్థి గోడం నగేశ్ అన్నారు. ముఖ్యమంత్రి ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానానికి మారోసారి టిక్కెట్ అందుకున్న గొడాం నగేశ్ తొలిసారిగా శుక్రవారం బజార్‌హత్నూర్ మండలకేంద్రానికి రావడంతో గ్రామస్తులు, నాయకులు ఘన స్వాగతం పలికారు. గ్రామంలో కాలినడక కలియ తిరిగి ప్రచారం చేపట్టారు. అనంతరం మండల టీఆర్‌ఎస్ నాయకులు ఎంపీ ఆభ్యర్థి గొడాం నగేశ్‌కు పుష్పగుచ్ఛాన్ని అందించారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో గొడాం నగేశ్ మాట్లాడుతూ రైతు పక్షపాతి అయిన కేసీఆర్ రైతుల కోసం దేశంలో ఎక్కడా అమలుచేయని పథకాలను ప్రవేశ పెట్టి చరిత్ర పుటల్లో నిలిచారని ఆయన అన్నారు. రైతులకు ఉచితంగా 24గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా, పెట్టుబడికోసం ఎకరానికి రూ.8 వేల ఆర్థిక సహాయం అందించడంతో పాటు రైతన్నకు రూ. 5లక్షల ప్రమాద బీమా సౌకర్యాన్ని అందించి దేశంలోనే నెంబర్‌వన్ సీఎంగా కేసీఆర్ కీర్తించబడుతున్నారన్నారు.

కారుగుర్తుకు ఓటు వేస్తాం..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజల సమస్యలను తీర్చిన మాజీ ఎంపీ గోడాం నగేశ్‌కు వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కారు గుర్తుకే ఓటు వేసి భారీ మెజార్టీతో గెలుపించుకుంటాం అని బజార్‌హత్నూర్ గ్రామస్తులు అన్నారు. కార్యాక్రమంలో టీఆర్‌ఎస్ పార్టీ మండల కన్వీనర్ నానం రమణ, రైతు సంఘం మండల అధ్యక్షుడు అల్కెగణేశ్, పీఏసీఎస్ చైర్మణ్ తూరటి భోజన్న, రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యులు చిల్కూరి భూమయ్య, నాయకులు పవన్‌కుమార్, కొత్త శంకర్, పరాచ సాయన్న, శేఖరావు, జైవంత్‌రావు, సూది నందు వినాయక్, వెంకన్న, రాములు, ఉత్తం, ప్రకాశ్, ఈశ్వర్, నాగోరావు తదితరులు పాల్గొన్నారు.

ఇచ్చోడలో ఘనంగా సన్మానం
ఇచ్చోడ : ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని ఆదిలాబాద్ టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి గొడాం నగేశ్ అన్నారు. ఆదిలాబాద్ పార్లమెంట్ టికెట్ మరోసారి గోడం నగేశ్‌కు ఇవ్వడంతో ఆయన బీ ఫామ్‌తో ఆదిలాబాద్ వస్తున్న క్రమంలో శుక్రవారం ఇచ్చోడలో ఎంపీకి టీఆర్‌ఎస్ నాయకులు పూలమాలలు, శాలువలతో ఘనంగా సత్కరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలను చూసి ఇతర పార్టీల ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని ఆయన వివరించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ముస్తాపురే అశోక్, జీవీ రమణ, ఎస్. కృష్ణకుమార్, ఏనుగు కృష్ణారెడ్డి, గాడ్గె సుభాష్, అబ్దుల్ రషీద్, పాండు రంగ్, సుభాష్ హరన్, నారాయణ, తులసీ పాల్గొన్నారు.

పార్టీ గెలుపునకు కృషి చేయాలి
నేరడిగొండ : పార్లమెంటు ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని టీఆర్‌ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గొడం నగేశ్ అన్నారు. శుక్రవారం ఎంపీ అభ్యర్థిగా బీఫాం తీసుకొని వచ్చిన సందర్భంగా ఆయనను పార్టీ నాయకులు నేరడిగొండలో పూలమాల వేసి శాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ప్రజలు పట్టం కడతారన్నారు. తక్కువ కాలంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా వెళ్లడం ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నామన్నారు. టీఆర్‌ఎస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కార్యకర్తలకు, నాయకులకు ఆయన సూచించారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు సయ్యద్ జహీర్, తిత్రే నారాయణసింగ్, గాదె శంకర్, జిల్లా నాయకులు జీవీ రమణ, ఏఎంసీ వైస్ చైర్మన్ దావుల భోజన్న, జాదవ్ అనిల్, చంద్రశేఖర్ యాదవ్, గాదెశంకర్, మహేందర్‌రెడ్డి, పీవీ రమణ, శివారెడ్డి, కోటేశ్వర్, రాజేశ్వర్, నేరడిగొండ సర్పంచ్ పెంట వెంకటరమణ, రవీందర్, భీంరావు, బోథ్ మండల నాయకులు ఆప్క కిషన్, రాజేశ్వర్‌రెడ్డి, వెంకటరమణ, అశోక్ పాల్గొన్నారు.

బోథ్‌లో...
బోథ్, నమస్తే తెలంగాణ: ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా టీఆర్‌ఎస్ టికెట్ దక్కించుకున్న గొడాం నగేశ్‌కు శుక్రవారం పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. నేరడిగొండ మండల రోల్ మామ్‌డ చెక్‌పోస్టు వద్దకు వాహనాలతో తరలి వెళ్లి స్వాగతం పలికారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి గా పోటీ చేస్తున్న గొడాం నగేశ్‌ను భారీ మెజార్టీతో గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ పార్టీ జిందాబాద్. కేసీఆర్, కేటీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు జివి రమణ, జాదవ్ అనిల్ పాల్గొన్నారు.

108
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles