ఉద్యాన పంటలకు ప్రోత్సాహం..!

Fri,March 22, 2019 11:48 PM

ఆదిలాబాద్ అర్బన్, నమస్తే తెలంగాణ : ప్రకృతి వైపరీత్యాలతో నష్టాలు చవిచూస్తున్న రైతును ఆదుకోడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యామ్నాయంగా ఉపాధి పెంచడానికి కృషి చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ఎంఐడీ (మిషన్ ఫర్ ఇంటిగ్రెటెడ్ డెవలప్‌మెంట్ ఆఫ్ హార్టికల్చర్) పథకం ద్వారా 40శాతం సబ్సిడీపై ఉద్యానవన పంటల సాగుకు జామ 10హెక్టార్లు, దానిమ్మ 13హెక్టార్లలో ఉద్యానవన పంటల సాగుకు టార్గెట్ ఇచ్చింది. ఈ ఉద్యాన వన పంటలలో సోయా, కంది, పెసర, శనగ, కూరగాయలు ఇతర పంటలను కూడా సాగు చేసుకోవచ్చు. రెండు కాలాల పాటు దానిమ్మ, జామ పండ్లను ఇస్తుంది. ఈ పండ్లతో రైతులకు ప్రత్యామ్నాయ ఉపాధి లభిస్తుంది. మొక్కలు నాటుకున్న తర్వాత రెండో సంవత్సరం నుంచి జామ కాత తీసుకోవచ్చు. దానిమ్మ 18నెలల తర్వాత క్రాప్ వస్తుంది. రైతు ఎకరానికి రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు ఆదాయం పొందవచ్చు. దినదినం ప్రతి ఏడాది ఖర్చు తగ్గడంతో పాటు ఆదాయం కూడా పెరుగుతుంది.

విడతల వారీగా డబ్బులు చెల్లింపు..
రైతు ముందుగా మొక్కలను కొనుక్కొని జామ ఎకరానికి 440 మొక్కలు, దానిమ్మ ఎకరానికి 267మొక్కలను నాటుకోవాల్సి ఉంటుంది. కాగా.. దానిమ్మ రకాలు భగువా, గణేశ్, గ్రుదుడ, జామలో వెరైటీలు అలహబాద్, సఫేదా, లక్నో 49, లలీత్, తాయి గోవా మొక్కలు మంచి ఫలాలను ఇస్తాయి. ఈ మొక్కలు బయట మార్కెట్‌లో ధర రూ. 60వరకు ఉంటుంది. సంగారెడ్డిలోని ప్రభుత్వ నర్సరీలో మొక్కకు రూ. 30వరకు లభిస్తాయి. మూడు సంవత్సరాల పాటు ఈ మొక్కల సంరక్షణకు ప్రభుత్వం రైతుకు డబ్బులు చెల్లిస్తుంది. హెక్టార్‌కు దానిమ్మకు రూ.16వేలు, జామకు రూ.30వేల చొప్పున చెల్లిస్తారు. మొదటి సంవత్సరం నాటిన మొక్కలకు 70శాతం బతికి ఉంటే 50శాతం డబ్బులు చెల్లిస్తారు. రెండో సంవత్సరం 90శాతం మొక్కలు బతికితే 30శాతం మూడో సంవత్సరం 20శాతం ఇలా చెల్లిస్తారు. ఉద్యానవన శాఖ అధికారులు పంటలను సంరక్షించిన తర్వాత ఇలా విడతల వారీగా రైతులకు మొక్కల సంరక్షణకు డబ్బులను చెల్లిస్తారు. ఉద్యానవన పంటల సాగుకు ఆసక్తి ఉన్న రైతుల నుంచి అధికారులు దరఖాస్తులను అహ్వానిస్తున్నట్లు హార్టికల్చర్ అధికారి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

79
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles