వాహన యజమాలపై కొరడా!

Fri,March 22, 2019 12:55 AM

ఆదిలాబాద్ అర్బన్, నమస్తే తెలంగాణ: ప్రభుత్వానికి పన్ను చెల్లించకుండా ఇష్టాను సారంగా వాహనాలను నడుపుతున్న వారిపై రవాణాశాఖ కొరడా ఝుళిపిస్తున్నది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను.. రవాణాశాఖకు రూ.42.80 కోట్లు టార్గెట్ ఉండగా.. ఇప్పటి వరకు రూ.36.58 కోట్లు వసూలయ్యాయి. ఇంకా రూ.6.26 కోట్లు రావాల్సి ఉంది. రాష్ట్రంలోని పన్ను వసూళ్లలో 12వ స్థానంలో జిల్లా నిలిచింది. కాగా.. మొండి బకాయిలను వసూలు చేసేందుకు డీటీసీ విజిలెన్స్ పాపారావు ఆదేశాల మేరకు ప్రత్యేక యాక్షన్ టీంలను తయారు చేశారు. జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్‌ను చేపట్టి అర్హత, సామర్థ్యం ఇతర ట్యాక్స్‌లు చెల్లించని వాహనాలపై జరిమానాలను విధిస్తున్నారు. ఈ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు 12కేసులు నమోదు కాగా.. 2బస్సులను సీజ్ చేసారు. రూ.21లక్షల జరిమానాను విధించారు.

12 కేసులు.. రెండు బస్సులు సీజ్..
2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను రవాణాశాఖకు రూ.42.80 కోట్ల టార్కెట్ ఉంది. ఇప్పటి వరకు రూ.36,58,68,000 వసూలు అయ్యాయి. ఇంకా రూ.6,26,32,000 పన్నులు వసూలు కావాల్సి ఉంది. 85.37శాతానికి చేరుకుంది. రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లా పన్ను వసూళ్లలో 12వ స్థానంలో నిలిచింది. ఇకా ఆర్థిక సంవత్సరం ముగియడానికి గడువు ఇంకా 9 రోజులు ఉండడంతో మొండి బకాయిలను వసూలిపై రవాణాశాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. డీటీసీ విజిలెన్స్ పాపారావు ఆదేశాల మేరకు జిల్లాలో యాక్షన్ టీంలను తయారు చేశారు. జిల్లాలో ఉన్న ఎంవీఐ, ఏఎంవీఐలకు టార్గెట్‌లు ఇచ్చారు. వారం రోజులుగా స్పెషల్ డ్రైవ్ చేపట్టి వాహనాల తనిఖీలను నిర్వహిస్తున్నారు. ప్రైవేట్ ట్రావెలర్స్‌తో పాటు ఇతర వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే బస్సుల్లో కమర్షియల్ గూడ్స్‌ను తరలిస్తుండగా.. నిబంధనలు పాటించని బస్సులపై కూడా కేసులు నమోదు చేశారు. స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు 12 కేసులు నమోదు కాగా.. రెండు బస్సులను సీజ్ చేసి రూ.21 లక్షల జరిమానాలు విధించారు.

జిల్లాలో స్పెషల్ డ్రైవ్..
ఆర్థిక సంవత్సరం గడువు సమీపిస్తుండగా.. రవాణాశాఖ అధికారులు మొండి బకాయిల వసూళ్లకు స్పెషల్ డ్రైవ్‌కు సిద్ధం అయ్యారు. దీర్ఘ కాలికంగా పన్నులు చెల్లించకుండా తిరుగుతున్న వాహనాలను గుర్తిస్తున్నారు. ఇందు కోసం ప్రత్యేక టీంలను తయారు చేశారు. గ్రామాలకు వెళ్లి సర్పంచులను కలిసి బకాయి దారులకు నోటీసులను జారీ చేస్తున్నారు. యజమానికి సంబంధించిన వాహనం ఉందా.. లేదా అనే విషయాలను తెలుసుకుంటారు. ఆ వాహనం స్క్రాప్‌లో అమ్మేశారా.. అమ్మివేస్తే ఆ వాహనానికి సంబంధించిన వివరాలను నమోదు చేసుకుంటారు. వాహనం ఉండి బకాయి చెల్లించక పోతే యజమానికి నోటీసులు ఇస్తున్నారు. సకాలంలో పన్ను చెల్లించని పక్షంలో వాహనాలను సీజ్ చేస్తున్నారు. రోజు వారి తనిఖీల్లో భాగంగానే జిల్లా వ్యాప్తంగా ఎంవీఐలు, ఏఎంవీఐలు స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వాహనాలకు సంబంధించి అర్హత సామర్థ్యం, అన్ని పత్రాలను తనిఖీలు చేస్తున్నారు. పత్రాలు లేని వాహనాలకు జరిమానాలు విధిస్తున్నారు. పన్నులు చెల్లించని వాహనాలకు సైతం భారీగా జరిమానాలు విధించి సీజ్ చేస్తున్నారు. ఆర్థిక సంవత్సరం గడువులోగా లక్ష్యాన్ని మించి పన్నులు వసూలు చేసి రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లా రవాణాశాఖను అగ్రస్థానంలో నిలుపుతామని అధికారులు పేర్కొంటున్నారు.

మొండి బకాయిల వసూలుకు స్పెషల్ డ్రైవ్..
మొండి బకాయిల వసూళ్లకు స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నాం. ఇందుకోసం ప్రత్యేక టీంలను తయారు చేశం. గ్రామాల్లోకి వెళ్లి గ్రామ సర్పంచుల నేతృత్వంలో బకాయి దారులకు నోటీసులు ఇస్తున్నాం. సకాలంలో బకాయి చెల్లించని వారి వాహనాలు సీజ్ చేయడంతో పాటు చర్యలు తీసుకుంటాం. ఆర్థిక సంవత్సరం ముగింపునకు ముందు లక్ష్యాన్ని ఛేదించి రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలుస్తాం.

93
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles