గుండె పోటుతో ఉద్యోగి మృతి

Fri,March 22, 2019 12:54 AM

ఎదులాపురం: పట్టణంలోని శాంతినగర్‌కు చెందిన గుమ్ముల సతీశ్ (30) గురువారం మధ్యాహ్నం గుండెపోటుతో మృతిచెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడు సాంఘిక సంక్షేమ శాఖలో ఆఫీస్ సబార్డినేట్‌గా పనిచేస్తున్నాడు. సతీశ్ చాతీలో నొప్పి అని చెప్పగా కుటుంబీకులు రిమ్స్‌కు తీసుకెళ్లారు. ఈలోగానే ఆయన మృతి చెందాడు. చిన్న వయసులో మృతిచెందిన సతీశ్ పలు సామాజిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనేవాడని స్థానికులు అన్నారు. కుటుంబీకుల రోదనలు కలిచివేశాయి. డీఎస్‌డీవో ప్రవీణ్‌కుమార్, ఉద్యోగులు వచ్చి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. సతీశ్ సిన్సియర్ ఉద్యోగి అని డీఎస్‌డీవో గుర్తుచేశారు. ఆయన మృతిపై శాఖ ఉద్యోగుల సంఘం, గంగపుత్ర సంఘం విచారం వ్యక్తంచేశాయి. అంత్యక్రియలు శుక్రవారం ఉదయం నిర్వహించనున్నారు.

95
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles