బాసర ఆలయంలో సైకో హల్‌చల్

Fri,March 22, 2019 12:54 AM

బాసర : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో ఓ సైకో వీరంగం సృష్టించాడు. గురువారం బాసర అమ్మవారి ఆలయంలోకి రెండు కత్తులతో చొరబడి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. గమనించిన ఆలయ సిబ్బంది, హోంగార్డులు అదుపులోకి తీసుకొని బాసర పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రసాద్‌గౌడ్ ఇప్పటికే నాలుగు సార్లు బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడని చెప్పారు. 2016 ఏప్రిల్ నెలలోనే అమ్మవారి సన్నిధిలో ఆత్మహత్యా యత్నం చేశాడు. అప్పుడు గమనించిన పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆ తర్వాత మరో రెండు సార్లు ఆలయంలో ఆత్మహత్యకు ప్రయత్నించి చివరి క్షణంలో ప్రాణాలతో బయటపడ్డాడు. గురువారం మళ్లీ ఆలయంలోకి చొరబడి ఆత్మహత్యా యత్నానికి పాల్పడడంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. ప్రసాద్‌గౌడ్ ఆత్మహత్య యత్నానికి పాల్పడుతుండడంతో పోలీసులు, అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇదేంటని అడిగితే తాను అమ్మవారి సన్నిధిలో చనిపోతే స్వర్గానికి వెళ్తానని, తాను అనాథనని వివరించారు

మంచి రోజుల్లోనే...
ఆత్మహత్యా యత్నానికి పాల్పడుతున్న ప్రసాద్ శుభదినాలు, పండుగ రోజులను మాత్రమే ఎంచుకుంటున్నాడు. గతేడాది మార్చి 21వ తేదీ ఆలయ ప్రాంగణంలో తన మణికట్టు కొసుకోని ఆత్మహత్యా యత్నానికి పాల్పడగా.. 2018 ఆగస్టు 11వ తేదీన కూడా ప్రయత్నం చేశాడు. మళ్లీ గురువారం తాజాగా హోలీ పర్వదినాన ఇలా ఆత్మహత్యా యత్నానికి పాల్పడడంతో అధికారులు ఆయనను పోలీస్ స్టేషన్ తరలించారు. గతంలో ఆలయ గర్భగుడిలో కత్తితో గోంతు కొసుకునే యత్నంలో ఆలయ పూజారి, తాత్కాలిక ఉద్యోగికి గాయాలయ్యాయి. చాకచక్యంతో సిబ్బంది పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం ప్రసాద్‌గౌడ్ పోలీసుల అదుపులో ఉన్నాడు.

76
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles