హోలీ డే.. జాలీగా..

Fri,March 22, 2019 12:54 AM

వేడుకల్లో సరదాగా గడిపిన ప్రముఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు
ఆదిలాబాద్ అర్బన్, నమస్తే తెలంగాణ/ఎదులాపురం: హోలి వేడుకలను గురువారం కలెక్టర్, ఎస్పీ క్యాంపు కార్యాలయాల్లో ఘనంగా నిర్వహించారు. వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కలెక్టర్‌కు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పోలీసులు ఏఆర్ హెడ్ క్వార్టర్స్ నుంచి బ్యాండ్‌మేళతాళాల మధ్య కేరింతలతో నృత్యాలు చేస్తూ ఎస్పీ క్యాంపు కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత క్యాంపు కార్యాలయంలో ఎస్పీ విష్ణువారియర్‌తో కలిసి పోలీసులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ వేడుకల్లో కలెక్టర్, ఎస్పీ దంపతులతో పాటు సబ్ కలెక్టర్ దంపతులు పాల్గొని ఒకరికొకరు రంగులు పూసుకుంటూ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఎస్పీలు మాట్లాడుతూ.. జిల్లా ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా ప్రజలు అన్ని పండుగలను సామరస్యంగా జరుపుకొంటూ శాంతి సంకేతాన్ని ఇస్తున్నారని కొనియాడారు. వచ్చే ఎన్నికల్లో ఓటర్లు నీతివంతమైన ఓటును వినియోగించి సమర్థ నాయకులను ఎన్నుకోవాలని కోరారు. బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ఇంటివద్ద హోలీ సందడి కనిపించింది. జోగురామన్న నివాసం ఇంటి వద్ద జోగు మహేందర్, ప్రేమేందర్‌కు నాయకులు రంగులు చల్లుతూ హోలి శుభాకాంక్షలు తెలిపి మిఠాయిలు తినిపించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయలశంకర్ ఇంటికి నాయకులు చేరుకొని హోలీ సంబురాలు జరుపుకొన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ కె.నర్సింహారెడ్డి, పట్టణ సీఐలు సురేశ్, జవాజీ సురేశ్, ప్రదీప్‌కుమార్, వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

77
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles