పాలీహౌస్ సందర్శించిన కలెక్టర్

Fri,March 22, 2019 12:54 AM

ఆదిలాబాద్ అర్బన్, నమస్తే తెలంగాణ: ఉద్యానవన సాగులో లాభాలు బాగుంటాయని కలెక్టర్ దివ్యదేవరాజన్ అన్నారు. గురువారం మండలంలోని భీంసారి గ్రామ రైతు హన్మండ్లు పెద్ద ఈరన్న పంటపొలాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎకరం భూమిలో 75 శాతం సబ్సిడీపై పాలిహౌస్‌ను నిర్మించుకొని కీరదోస సాగుచేసి రోజుకు రూ.10 వేలు సంపాదిస్తున్నారని కొనియాడారు. ప్రకృతి వైపరిత్యాలతో చేతికి అందివచ్చిన పంటలు దెబ్బతిని రైతులు నష్టాలు చవిచూడాల్సి వస్తుందన్నారు. పాలిహౌస్, నెట్‌హౌస్‌ల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీపై రుణాలు అందజేస్తున్నాయన్నారు. రైతు ఒక ఎకరంలో నిర్మించుకొని వివిధ రకాల పంటలను సాగు చేస్తే మంచి దిగుబడులు వచ్చి లాభం పొందవచ్చన్నారు. రైతులు హన్మండ్లు పెద్ద ఈరన్నను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. పంటల సాగులో ఎప్పటికప్పుడు ఉద్యానవనశాఖ అధికారుల సలహాలు, సూచనలు తీసుకొని ఏ మోతాదులో ఎంత మందులు వాడాలో తెలుసుకొని వాడాలన్నారు. కలెక్టర్ వెంట జిల్లా ఉద్యానవన, పట్టు పరిశ్రమ అధికారి వెంకటేశ్వర్లు, ఉద్యానవన అధికారి శ్రీనివాస్‌రెడ్డి, రైతులు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

83
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles