ఎమ్మెల్సీ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి

Fri,March 22, 2019 12:54 AM

ఆదిలాబాద్ అర్బన్, నమస్తే తెలంగాణ : శాసన మండలి ఎన్నికలను సమర్థవంతంగా, ఎన్నికల నియమావళి మేరకు నిర్వహించాలని కలెక్టర్ దివ్యదేవరాజన్ అన్నారు. గురువారం స్థానిక టీటీడీసీలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను సందర్శించి పోలింగ్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ జరుగుతున్నందున శాసన మండలి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే ఓటరు కుడి చేతి చూపుడు వేలుకు సిరాను పెట్టాలని తెలిపారు. గ్రాడ్యూయేట్, ఉపాధ్యాయుల ఎన్నికలను 22న ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఓటు హక్కు ప్రాధాన్యత క్రమంలో ఏ విధంగా వినియోగించుకోవాలో తెలియజేసే ఫ్లెక్సీని ప్రతి పోలింగ్ కేంద్రం ముందు ఏర్పాటు చేయడం చేస్తున్నామన్నారు. ఎన్నికల కమిషన్‌చే సరఫరా చేయబడిన స్కెచ్‌పెన్‌తో మాత్రమే ప్రాధాన్యత క్రమంలో న్యూమరల్, రోమన్ న్యూమరల్ పద్ధతిలో మాత్రమే నమోదు చేయాలన్నారు. ఫొటో ఓటరు స్లిప్‌తో పాటు, ఫొటో గుర్తింపు కలిగిన ఆధార్, ఉద్యోగుల ఐడీకార్డు, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, డిగ్రీ సర్టిఫికెట్, దివ్యాంగుల గుర్తింపు కార్డు వంటి వాటిలో ఏదైనా ఒకటి తీసుకొని వెళ్లాల్సి ఉంటుందని తెలిపారు. సజావుగా నిర్వహించేందుకు సిబ్బంది సహకరించాలని అన్నారు. ఈ సమావేశంలో ఎస్పీ విష్ణువారియర్, జేసీ సంధ్యారాణి, డీఆర్వో ఎన్.నటరాజ్, ఆర్డీవో సూర్యనారాయణ, తహసీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.

81
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles