తల్లి ఒడికి చేరినట్లుంది

Thu,March 21, 2019 12:41 AM

- కేటీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరిన అనిల్ జాదవ్
- భారీగా తరలిన అనుచరులు

నేరడిగొండ : చాలా కాలంగా ఇతర పార్టీలో పనిచేసి చివరకు తల్లి ఒడికి చేరినట్లుందని కాంగ్రెస్ పార్టీ బోథ్ నియోజకవర్గ మాజీ ఇన్‌చార్జి జాదవ్ అనిల్ అన్నారు. బుధవారం ఆయన తన అనుచరులతో కలిసి హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. జాదవ్ అనిల్‌కు టీఆర్‌ఎస్ కండువా కప్పి కేటీఆర్ స్వాగతంపలికారు. బుధవారం అనిల్‌జాదవ్ నేరడిగొండ నుంచి భారీ వాహన శ్రేణితో హైదరాబాద్ తరలివెళ్లారు. ఈ సందర్భంగా జాదవ్ అనిల్ మాట్లాడుతూ తాను 2001 నుంచి టీఆర్‌ఎస్ పార్టీలో కీలకంగా పనిచేసినప్పుడు బోథ్ నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసినట్లు చెప్పారు. పరిస్థితుల కారణంగా కాంగ్రెస్‌లోకి వెళ్లి తిరిగి టీఆర్‌ఎస్‌లోకి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందించడం చూసే తాను పార్టీలో చేరినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలోనే తెలంగాణ రాష్ట్రం సాధించడం రెండో దఫా కూడా మళ్లీ అధికారంలోకి రావడం అభినందనీయమన్నారు. పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉందన్నారు. అంతే కాకుండ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ పార్టీ పటిష్టతకు, నిబద్దతతో పనిచేస్తానన్నారు. అభివృద్ధి కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ బంగారు తెలంగాణలో భాగస్వామినవుతానని చెప్పారు. కేటీఆర్‌కు పుష్పగుచ్ఛం అందించి, శాలువ కప్పి సన్మానించారు. అటవీ పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీ గొడం నగేశ్, వేణుగోపాలచారి, ఎమ్మెల్యేలు జోగురామన్న, రాథోడ్ బాపురావు, లోకభూమారెడ్డి, అరవింద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం లోకా భూమారెడ్డి జన్మదినం సందర్భంగా నాయకులు ఆయనను సన్మానించారు.

98
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles