నేడు ఓటర్స్ హోలీ

Thu,March 21, 2019 12:40 AM

ఆదిలాబాద్ / నమస్తే తెలంగాణ ప్రతినిధి : పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండడంతో అధికారులు ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జిల్లాలో ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగింది. అసెంబ్లీ ఎన్నికలకంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని మరింత పెం చేందుకు అధికారులు విస్తృతంగా అవగాహన కా ర్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నేడు హోలీ సందర్భంగా జిల్లా కేంద్రంలో ఓటర్ హోలీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ దివ్య, ఎస్పీ విష్ణువారియర్‌తో పాటు వివిధ శాఖల అధికారులు, ప్రజలు హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లా వ్యాప్తం గా 83.46 శాతం పోలింగ్ నమోదుకాగా ఆదిలాబాద్ నియోజకవర్గంలో 80.93 శాతం, బోథ్ ని యోజకవర్గంలో ఎక్కువగా 85.38 శాతం పోలిం గ్ నమోదైంది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అధికారులు వివిధ కార్యక్రమాల ద్వారా ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పించారు. ఫలితంగా 2014 ఎన్నికలతో పోల్చితే పోలింగ్ శాతం గణనీయంగా పెరిగింది. ఆదిలాబాద్ ని యోజకవర్గంలో 17.72 శాతం పోలింగ్ పెరుగగా బోథ్ నియోజకవర్గంలో 5.47 శాతం పెరిగింది. పార్లమెంట్ ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా పోలింగ్ శాతాన్ని పెంచేందుకు అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే జిల్లా వ్యా ప్తంగా ఓటు హక్కు వినియోగంపై విస్తృతంగా కార్యక్రమాలు చేపట్టారు. చునావ్ పాఠశాల కార్యక్రమం ద్వారా గ్రామస్థులకు ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పిస్తున్నారు. కళాశాలల విద్యార్థులతో పాటు ఈవీఎం, వీవీ ప్యాట్‌ల ద్వారా ఓటు ఎలా వేయాలనే విషయాలను తెలియజేస్తున్నారు. గ్రామాల్లో సైతం ఓటర్లు అవగాహన కార్యక్రమాలకు భారీ సంఖ్యలో హాజరవుతున్నారు. ఈ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వచ్చే వా రికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారు లు పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు.

నేడు ఓటర్స్ హోలీ
హోలీ పండుగ సందర్భంగా పార్లమెంట్ ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచడంతో పాటు ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా అధికారులు నేడు ఓటర్స్ హోలీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ అవగాహన కార్యక్రమానికి కలెక్టర్ దివ్య, ఎస్పీ విష్ణువారియర్‌తో పాటు వివిధ శాఖల నోడల్ అధికారులు, సిబ్బంది హాజరవుతారు. ఈ కార్యక్రమంలో భాగంగా నేను ఓటుహక్కును వినియోగించుకుంటానని ప్రతిజ్ఞ చేయించడంతో పాటు, బ్యానర్‌ను ఏర్పాటు చేసి ఓటర్లతో వివిధ రంగులతో సంతకాలు సేకరిస్తారు. ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా ఓటు హక్కును వినియోగించుకుంటానని విషయాన్ని తెలియజేసేలా ఉట్టికొట్టే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో మహిళ స్వయం సహాయక సంఘాల సభ్యులు, విద్యార్థులు, స్థానిక ప్రజలు హాజరవుతారని అధికారులు తెలిపారు.

112
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles