ప్రచారానికి తెర..

Thu,March 21, 2019 12:40 AM

ఆదిలాబాద్ / నమస్తే తెలంగాణ ప్రతినిధి : కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ నియోజకవర్గాల గ్రాడ్యూయేట్ ఓటర్లు 196321 మంది, ఉపాధ్యాయ ఓటర్లు 23,214 మంది ఉండగా, ఆదిలాబాద్ జిల్లాలో 7789 మంది పట్టభద్రలు ఓటర్లు, 1554 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉన్నారు. పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ స్థానాలకు శుక్రవారం ఎన్నికలు జరుగనుండగా బుధవారం సా యంత్రం ప్రచారం ముగిసింది. పట్టభద్రుల స్థానం కోసం 17 మంది పోటీలో ఉండగా ఇందులో ప్రధాన పార్టీల మద్దతు తెలిపిన అభ్యర్థులు సైతం ఉన్నారు. నెల రోజులు పాటు అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. పట్టభద్రులు, ఉద్యోగులు, సంఘాల నాయకులను కలుస్తూ వ్యూహత్మకంగా వ్యవహరించారు. తమకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు. ఇండిపెండెట్ అభ్యర్థులు సైతం ఓటర్లను కలుస్తూ తమకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ ఎన్నికల్లో తాము గెలిస్తే ఏం చేస్తామనే విషయాలను వివరించారు. ఎక్కువగా సంఘాల సమావేశాలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఫోన్లు, మెస్సేజ్‌ల ద్వారా సైతం అభ్యర్థులు ప్రచారం నిర్వహించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కోసం పోటీలో ఉన్న ఏడుగురు అభ్యర్థులు సైతం ఉపాధ్యాయులు, సంఘాల నాయకులను కలిసి తమను గెలిపించాలని కోరారు.

బుధవారం సాయంత్రంతో సమయం ముగియడంతో ఎలాంటి ప్రచారానికి తావులేకుండా అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. ఓటర్లను ప్రలోభపెట్టకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఫోన్ల ద్వారా వాయిస్ రికార్డులు, మెస్సేజ్‌లు పంపవద్దని అభ్యర్థులకు సూచించారు. అధికారులు ఎన్నికల కోడ్ విషయంలో సైతం పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి పోలింగే రోజు శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు అభ్యర్థులు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. రేపు జరిగే పోలింగ్‌కు సైతం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకునేలా వివిధ ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ నిర్వహణపై అధికారులు సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా కామన్ పోలింగ్ కేంద్రాలు 13, ప్రత్యేకంగా టీచర్స్ ఎమ్మెల్సీకి 7 పోలింగ్ కేంద్రాలు, మొత్తం 20 కేంద్రాలను ఏర్పాటు చేసి అన్ని సౌకర్యాలు కల్పించారు. ఎన్నికల నిర్వహణకు 23మంది పీవోలు, 27మంది ఏపీవోలు, ఎన్నికల సిబ్బంది 102మంది అధికారులకు విధులు కేటాయించారు. 22న పోలింగ్ సందర్భంగా పట్టభద్రులు, ఉపాధ్యాయులు ఓటు వేసేందుకు వీలుగా స్పెషల్ క్యాజువల్ సెలవుగా ప్రకటించారు.

73
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles