ప్రశాంతంగా పది పరీక్షలు

Thu,March 21, 2019 12:39 AM

ఎదులాపురం : పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని డీఈవో డా.రవీందర్‌రెడ్డి అన్నారు. బుధవారం ఇంగ్లిష్ పేపర్-1 పరీక్ష నిర్వహించారు. పరీక్షా కేంద్రాల లోపల, బయట విద్యార్థులకు ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అని విద్యార్థులను అ డిగి తెలుసుకున్నారు. ఉదయం 8.45 నిమిషాలకే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని డీఈవో సూచించారు. జిల్లా వ్యాప్తంగా 61 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. 10,687మంది విద్యార్థులు హాజ రు కావాల్సి ఉండగా.. 10,548మంది హాజరయ్యారు. 139 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. ఏడు పాఠశాలలను స్వయంగా డీఈవో తనిఖీ చేశారు. పరీక్షా కేంద్రాల లోనికి వెళ్లే విద్యార్థులకు పరీక్ష రాసిన అనంతరం బయటకు వచ్చిన విద్యార్థులకు సౌకర్యాలు ఎలా ఉన్నాయని తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఏమైనా ఇబ్బందులుంటే తన దృష్టికి తీసుకరావాలని సూచించారు.

పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన డీఈవో
జైనథ్ : మండల కేంద్రంలోని పదో తరగతి పరీక్ష కేంద్రాన్ని బుధవారం జిల్లా విద్యాశాఖ అధికారి డా.రవీందర్‌రెడ్డి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. డీఈవో వెంట చీఫ్ సూపరిం టెండెంట్ లక్ష్మణ్ ఉన్నారు.

68
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles