విధులు ఉన్నచోటే ఓటు హక్కు..!

Thu,March 21, 2019 12:39 AM

ఆదిలాబాద్ అర్బన్, నమస్తే తెలంగాణ : ఉద్యోగులకు ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికెట్ (ఈడీసీ) సిస్టం ద్వారా ఎన్నికల విధులు నిర్వహించే పోలింగ్ కేంద్రంలోనే ఓటు వేసే అవకాశాన్ని ఈసీ కల్పించింది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల నుంచే ఈ నూతన విధానం అమలు కానుంది. ఈ మేరకు ఎన్నికల అధికారులు పోలింగ్ అధికారులకు శిక్షణ ఇస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో విధులు నిర్విహించే అధికారులు, ఉద్యోగులు ఇప్పటికే అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి(ఏఆర్వో)లకు ఈడీసీ కోసం దరఖాస్తు ఫారాలను అందజేశారు. పోలింగ్ రోజున ఎన్నికల విధులు నిర్వహించే ప్రభుత్వ అధికారు లు, ఉద్యోగుల కోసం ఇన్నాళ్లు పోస్టల్ బ్యాలెట్ విధానం అమల్లో ఉంది. పోలింగ్‌కు ముందే వా రు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును సద్వినియోగం చేసుకునే వారు. ఒక దశలో తమ పో స్టల్ బ్యాలెట్ సంబంధిత ఎన్నికల అధికారులకు అందిందా? లేదా? అనే సందేహం ఉండేది. త మ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోస్టల్ బ్యాలెట్‌నే అనుసరిస్తున్నారు. ఈ నేపథ్యం లో కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా నిర్ణయం తీసుకుంది. విధులు నిర్వహించే అధికారులు, ఉద్యోగులు గానీ పోలింగ్ రోజున డ్యూటీ చేసే పోలింగ్ కేంద్రంలోనే నేరుగా ఓటు వేసేలా ఈ డీసీ విధానాన్ని రూపొందించింది. ప్రయోగాత్మకంగా దీనిని ఎమ్మెల్సీ ఎన్నికల నుంచే అమల్లోకి తేవాలని అధికారులను ఆదేశించింది. ఎన్నికల అధికారులు పోలింగ్ విధులు నిర్వహించే అధికారులు, ఉద్యోగులకు ఈడీసీ విధానంపై అవగాహ న కల్పిస్తున్నారు.

హర్షం వ్యక్తం చేస్తున్న అధికారులు..
ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు, ఉద్యోగులందరికీ ఈడీసీ విధానం వర్తిస్తుంది. పోలింగ్ రోజున ఎవరెవరు ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారో వారి వివరాలు ఎన్నికల అధికారుల వద్ద ఉంటాయి. వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రా ల ఆధారంగా డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో సదరు అ ధికారులు, ఉద్యోగుల వివరాలను నమోదు చేస్తా రు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌లో సహాయ రిటర్నింగ్ అధికారి (ఏఆర్వో)గా విధులు నిర్వర్తించే స్థానిక ఆర్డీవో అధికారులు, ఉద్యోగులకు ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికెట్‌ను జారీ చేస్తారు. ఈ సర్టిఫికెట్ ఆధారంగానే వారు సాధారణ పౌరుల మాదిరిగా ఎన్నికలు విధులు నిర్వహిస్తున్న పోలింగ్ కేంద్రంలోనే నేరుగా ఓటు వేస్తారు. ఈ మేరకు ముద్రించిన ఫా రం నింపి ఏఆర్వోకు అందించాలి. పోలింగ్‌కు కొద్దిరోజుల ముందే తయారయ్యే ఈడీసీలను బ్యాలెట్ బాక్సులు, ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌లలో ఏఆర్వోలు ఎన్నికల విధులకు వెళ్లే అధికారులు, ఉద్యోగులకు ఇస్తారు. వీటితో సదరు అధికారులు, ఉద్యోగులు తాము ఎన్నికల విధులు నిర్వహించే పోలింగ్ కేంద్రంలో ఓటు వేస్తారు. ఎమ్మెల్సీ ఎన్నికల నుంచే ఈ సరికొత్త విధానాన్ని అమల్లో పెట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ నెల 22వ తేదీన జరిగే ఉపాధ్యా య, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోలింగ్ విధులు నిర్వహించే అధికారులు, ఉద్యోగులకు ఈడీసీలు అందజేసేందుకు కసరత్తు జరుగుతోం ది. ఈ నూతన విధానం అందుబాటులోకి రావడంతో అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

113
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles