నర్సింగ్ హోమ్‌లపై ఆదాయపన్ను శాఖదాడులు

Wed,March 20, 2019 12:26 AM

భైంసా, నమస్తే తెలంగాణ : పట్టణంలోని రెండు ప్రైవేటు నర్సింగ్ హోమ్‌లపై ఆదాయ పన్ను శాఖ అధికారులు మంగళవారం దాడు లు నిర్వహించారు. నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్‌కు చెందిన ఐటీ అధికారులు దాడు ల్లో పాల్గొన్నారు. మధ్యాహ్నం నుంచి సాయం త్రం వరకు దాడులు జరిగాయి. వైద్యులు ఉండే గదులకు వెళ్లి రికార్డులను పరిశీలించారు. రిసెప్షన్ కౌంటర్లలో దవాఖానకు వచ్చే ఓపీ వివరాలను సేకరించారు. ఇన్ పేషంట్ వివరాలు, ఆరోగ్యశ్రీ కేసుల నమోదు తదితర అంశాలను పరిశీలించారు. దాదాపు పదేళ్ల క్రితం జిన్నింగ్ మిల్లుల్లో ఆదాయపన్ను శాఖ దాడులు నిర్వహించింది. నర్సింగ్ హోమ్‌లల్లో ఐటీదాడులు కలకలం రేపాయి. దాడుల విషయం తెలుసుకున్న కొందరు వైద్యులు ముందు జాగ్రత్తలు తీసుకొన్నారు. రోగుల నుంచి ముక్కు పిండి ఫీజు వసూళ్లకు పాల్పడుతున్నట్లు, అక్రమంగా ఆస్తులు కూడబెట్టినట్లు అధికారులకు సమాచారం అందినట్లు తెలుస్తోంది.

కడెం : ప్రభుత్వం మిషన్ భగీరథ ద్వారా ఇంటిం టికీ శుద్ధమైన తాగునీటిని అందిస్తోందని, ఇప్పటికే అనేక గ్రామాలకు నల్లాల ద్వారా తాగునీటి సరఫరా జరుగుతున్నట్లు ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ దేవేందర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం మండలంలోని నచ్చన్ ఎల్లాపూర్ గ్రామంలోని మిషన్ భగీరథ ద్వారా సరఫరా అవుతున్న నల్లా నీటిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రా మీణ ప్రాంత ప్రజలకు వేసవిలో తాగునీటి ఇబ్బందులు లేకుండా మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ కడెం జలాశయం ద్వారా శుద్ధమైన నీటిని అందిస్తున్నట్లు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలు స్వచ్ఛమైన శుద్ధనీటిని తాగాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ కల నెరవేరుతుందని అన్నారు. నియోజకవర్గంలోని అనేక గ్రామాలకు తాగునీటి సరఫరా జరుగుతున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కార్యక్రమంలో స్రర్పంచ్ బొ డ్డు గంగన్న, ఆర్‌డబ్ల్యూఎస్ జేఈఈ హరీశ్, లైన్‌మెన్ రాజేశ్వర్ తదితరులున్నారు.

66
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles