పాతూరికి ప్రాధాన్యత ఓటువేసి గెలిపించాలి

Wed,March 20, 2019 12:26 AM

నిర్మల్ అర్బన్,నమస్తే తెలంగాణ : మెదక్,నిజామాబాద్,కరీంనగర్,ఆదిలాబాద్ జిల్లాల టీఆర్‌ఎస్ ఉపాధ్యా య ఎమ్మెల్సీ అభ్యర్థి పాతూరి సుధాకర్ రెడ్డికి మొదటి ప్రాదాన్యత ఓటు వేసి గెలిపించాలని రాష్ట్ర అటవీ,పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నా రు. మంగళవారం నిర్మల్ క్యాంపు కార్యాలయంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పాతూరి సుధాకర్ రెడ్డి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని మర్యాధపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ పదో పీఆర్‌సీ 43శాతం ఫిట్‌మెంట్, వేతన సవరణ బకాయిలు ఇప్పించడానికి సుధాకర్ రెడ్డి కృషి చేశారన్నారు. రాష్ట్రంలో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న సుధాకర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఉపాధ్యాయులు,అధ్యాపకులను కోరారు.ఈకార్యక్రమంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి వి.సత్యనారాయ ణ గౌడ్, టీఆర్‌ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి
ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పాతూరి సుధాకర్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో సంఘ భవనంలో టీ యూటీఎఫ్,ఆర్‌యూపీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరై మా ట్లాడారు. తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్,రాష్ట్రీయ పండిత పరిషత్ సంయుక్తంగా మద్దతు తెలిపి తన గెలుపునకు కృషి చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఐఆర్, పీఆర్సీ, భాషా పండితుల పదోన్నతులు,కాంట్రాక్టు ఉపాధ్యాయులకు ఉద్యోగ భద్రత తదితర సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.అనంతరం పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు సుధాకర్‌రెడ్డికి పూలమాలవేసి, శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో స్వామి రెడ్డి, జగదీశ్, నర్సిం హులు, మురళీమనోహర్ రెడ్డి, నాగభూషణ్, గంగాధర్, రాజేశ్వర్, లక్ష్మీప్రసాద్ రెడ్డి, రఘువీర పాణి, సంజీవ్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

88
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles