కేంద్ర బలగాల కవాతు

Wed,March 20, 2019 12:25 AM

ఆదిలాబాద్ అర్బన్, నమస్తే తెలంగాణ: పార్లమెంట్, ఎమ్మెల్సీ ఎన్నికలకు ప్రశాంత వాతావరణం కల్పించడానికి కేంద్ర బలగాలతో కవాతు నిర్వహిస్తున్నామని ఎస్పీ విష్ణువారియర్ అన్నారు. మంగళవారం పట్టణంలోని పలు కాలనీల్లో కేంద్ర బలగాలు కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సమస్యాత్మక ప్రాంతాలు, పలు చౌక్‌ల గుండా కేంద్ర బలగాలతో పాటు జిల్లా పోలీసులతో కవాతు నిర్వహించామని చెప్పారు. వెయ్యి మంది పోలీసులతో కలిసి కవాతు నిర్వహించి మేమున్నామంటూ ప్రజలకు భరోసా కల్పించామన్నారు. సార్వత్రిక ఎన్నికలను ప్రశాంతగా నిర్వహించడానికే కేంద్ర బలగాలతో కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రజలు నిర్భయంగా తమ ఓటుహక్కు వినియోగించుకోవాలన్నారు. జిల్లాలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు తావివ్వకుండా జిల్లా అంతటా నిఘా ఏర్పాటు చేశామన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాల భద్రత ఉంటుందన్నారు. ఎన్నికలు సజావుగా కొనసాగించడానికి ప్రజల సహకారం అవసరం ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఎస్‌ఎఫ్ అధికారులు సందీప్‌కుమార్, అశోక్, శ్రీ వాస్తవ్, డీఎస్పీ నర్సింహరెడ్డి, పట్టణ సీఐలు సురేశ్, నాగరాజు, ప్రదీప్‌కుమార్, ఆర్‌ఐలు సుధాకర్‌రావు, వామనమూర్తి, ఎస్సైలు గుణవంత్‌రావు, ప్రభాకర్ తదితరులు ఉన్నారు.

61
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles