కలెక్టరేట్ వద్ద భారీ బందోబస్తు

Mon,March 18, 2019 11:28 PM

ఆదిలాబాద్ అర్బన్, నమస్తే తెలంగాణ : పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అయిన నేపథ్యంలో కలెక్టరేట్ వద్ద భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. కార్యాలయానికి ఇరువైపులా వంద మీటర్ల నిబంధనలు విధించారు. నామినేషన్ వేయడానికి వచ్చే అభ్యర్థులు వంద మీటర్ల దూరంలోనే వాహనాలను నిలిపివేస్తున్నారు. అక్కడి నుంచే అభ్యర్థితో పాటు ఐదుగురు వ్యక్తులను బలపర్చడానికి అనుమతి ఇస్తున్నారు. కలెక్టరేట్ నుంచి వంద మీటర్ల లోపు బారికేడ్లను ఏర్పాటు చేశారు. వివిధ పనుల నిమిత్తం వెళ్లే ప్రజలను పోలీసులు పూర్తి వివరాలు అడిగి తెలుసుకొని పరిశీలించిన తర్వాతే లోనికి అనుమతి ఇస్తున్నారు. కలెక్టరేట్ వద్ద 144సెక్షన్‌ను విధించారు. సీఐలు, ఎస్సైలు, ఏఎస్సైలతో పాటు హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు బం దోబస్తులో నియమించారు. స్థానిక డీఎస్పీ కె.నర్సింహారెడ్డి బందోబస్తును పర్యవేక్షించారు.

88
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles