అటవీ జంతువుల వేటగాళ్ల పట్టివేత

Mon,March 18, 2019 11:19 PM

ఇచ్చోడ : వన్య ప్రాణుల వేటగాళ్లను టైగర్ జోన్ సిరిచెల్మ రేంజ్ అటవీ అధికారులు ఆదివారం రాత్రి పట్టుకున్నారు. రేంజ్ అధికారి వాహబ్ అహ్మద్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. రేంజ్ పరిధిలోని వన్కతుమ్మ బీట్ గోపాల్‌పూర్ శివారు ప్రాంతంలో వన్య ప్రాణులను వేటాడేందుకు ఉట్నూర్ మండలానికి చెందిన ముగ్గురు వేటగాళ్లు సంచరిస్తున్నారని ముందస్తు సమాచారం అందిందని ఆయన పేర్కొన్నారు. దీంతో ఈ ప్రాం తంలో అటవీ అధికారులు ముమ్మ రంగా తనిఖీలు నిర్వహించారు. గోపాల్‌పూర్ అటవీ శివారులో అటవీ జంతువులను ముగ్గురు వేటగాళ్లు ఉచ్చులు బిగించి అక్కడ కూర్చుకున్నారని వివరించా రు. వారిని అదుపులోకి తీసుకొని వారి వద్ద ఉన్న వలలు, గొడ్డళ్లు, టార్చిలైట్లు ఇతర పరికరాలను స్వాధీనం చేసుకొని వారిని ఇచ్చోడ టైగర్ జోన్ కార్యాలయానికి తీసుకొచ్చి విచారించామన్నారు. ఉట్నూర్ మండలం పట్టిగూడ గ్రామానికి చెందిన చీపెళ్లి ఎర్రన్న, పోశన్న, కొల్పు శ్రీనుగా గుర్తించామని, చేసిన నేరాన్ని వారు అంగీకరించినట్లు తెలిపారు. వేటగాళ్లను సోమవారం బోథ్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పర్చి రిమాండ్‌కు తరలించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ దాడిలో వాయిపేట్ ఎఫ్‌ఎస్‌వో ప్రేమ్‌సింగ్, బేస్ క్యాంప్ సిబ్బంది పాల్గొన్నారని ఆయన వివరించారు.

58
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles