నేటి నుంచి నామినేషన్ల పర్వం

Mon,March 18, 2019 01:18 AM

ఆదిలాబాద్ నమస్తే తెలంగాణ ప్రతినిధి: ఏప్రిల్ 11న జరిగే పార్లమెంట్ ఎన్నికలకు నేడు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయనుంది. నోటిఫికేషన్ జారీ అయిన వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. నేటి నుంచి ఈ నెల 25 వరకు లోకసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు సమర్పించుకునే అవకాశం ఉంది. ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసేవారు తమ నామినేషన్ల దాఖలు చేసేకునేందుకు అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ దివ్య రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తారు. నామినేషన్ల స్వీకరణకు గానూ కలెక్టర్ చాంబర్‌లో రిటర్నింగ్ అధికారి కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు.

పార్లమెంట్ ఎన్నికలకు నేడు నోటిఫికేషన్ వెలువడనుండగా నేటి నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి స్థానిక కలెక్టర్ దివ్య రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తారు. ఈ పార్లమెంట్ నుంచి పోటీ చేసే అభ్యర్థులు తమ నామినేషన్లను ఆదిలాబాద్ రిటర్నింగ్ అధికారికి సమర్పించాల్సి ఉంటుంది. నేటి నుంచి ఈ నెల 25 వరకు నామినేషన్ల స్వీకరణకు గడువు ఉండగా సెలవు రోజుల్లో నామినేషన్లు తీసుకోరు. నామినేషన్ల స్వీకరణకు గానూ కలెక్టర్ చాంబర్‌లో రిటర్నింగ్ అధికారి కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారితో పాటు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, ఇతర ఎన్నికల సిబ్బంది ఉంటారు. రిటర్నింగ్ అధికారి కార్యాలయం పరిసరాల్లో నిబంధనల మేరకు ఏర్పాట్లు చేశారు.ఆదిలాబాద్ ఎస్టీ నియోజకవర్గం కావడంతో అభ్యర్థులు రూ.12,500 డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది.

ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా ఆదిలాబాద్, బోథ్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఆదిలాబాద్ జిల్లాలో, మధోల్, నిర్మల్, ఖానాపూర్ నిర్మల్ జిల్లా పరిధిలోకి సిర్పూర్, ఆసిఫాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాలు కుమ్రంభీ ఆసిఫాబాద్ జిల్లాల పరిధిలోకి వస్తాయి.
నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సోమవారం నుంచే ప్రారంభిస్తుండడంతో పోటీ చేసేవారు తమకు అనుకూలంగా ఉన్న రోజును చూసుకునే నామినేషన్లు వేయనున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ఇతరులు రెండు లేదా మూడు సెట్ల నామినేషన్ల పత్రాలను దాఖలు చేస్తారు. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ పార్టీకి ప్రజల మద్దతు బాగా ఉంది.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్ధులు ఘన విజయం సాధించగా ఆసిఫాబాద్ నుంచి గెలుపొందిన ఆత్రం సక్కు ఇటీవల గులాబీ పార్టీలో చేరారు. ఏడు నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌కు బలమైన నాయకత్వంతోపాటు మంచి క్యాడర్ ఉండటంతో టీఆర్‌ఎస్ అభ్యర్థి భారీ మెజార్టీతో విజయం సాధించనున్నారు. కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం ప్రయత్నించి విఫలమైన నరేశ్‌జాదవ్ ఇప్పటికే హస్తం పార్టీకీ రాజీనామా చేయగా మరో నేత సోయం బాపురావు సైతం బీజేపీలో చేరనున్నారు. దీంతో కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించిన అభ్యర్థి రాథోడ్ రమేశ్‌కు సొంత పార్టీ నుంచి మద్దతు లభించే అవకాశాలు తక్కువగా ఉన్నాయి.

95
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles