కలెక్టరేట్‌లో మీడియా సెంటర్ ఏర్పాటు

Mon,March 18, 2019 01:16 AM

ఆదిలాబాద్ అర్బన్, నమస్తే తెలంగాణ : ఎమ్మెల్సీ, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో మీడియా సెంటర్‌ను ఏర్పాటు చేశారు. కలెక్టర్ దివ్యదేవరాజన్ సోమవారం ఈ కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా డీపీఆర్వో భీమ్‌కుమార్ ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికలకు సంబంధించిన అన్ని వివరాలు ఈ కేంద్రంలో లభించనున్నాయి. నేడు పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుండగా.. అదే రోజు నుంచి నా మినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. రోజు వారీగా వచ్చిన నామినేషన్ల వివరాలతో పాటు అభ్యర్థులకు సంబంధించిన అన్ని వివరాలు ఈ మీడియా సెంటర్‌లో అందుబాటులో ఉంచుతారు. ప్రతి ఛానల్, దినపత్రికలకు కూడా ఇక్కడి నుంచే సమాచారాన్ని డీపీఆర్వో అందజేస్తారు. నియోజకవర్గాల వారీగా ఓటర్ల వివరాలు కూడా ఈ సెంటర్‌లో అందుబాటులో ఉం టాయి. అభ్యర్థులు టీవీ ఛానళ్లలో ఇస్తున్న ప్రకటనలకు సంబంధించి అన్ని వివరాలను రికార్డ్ చేస్తారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘిస్తే ఈ రికార్డులతో చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు. ఎమ్మెల్సీ, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అన్ని వివరాలు ఈ సెంటర్‌లో అందుబాటులో ఉంచుతున్నారు.

106
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles