ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉండాలి

Mon,March 18, 2019 01:16 AM

ఎదులాపురం : విధుల్లో అప్రమత్తంగా ఉండి లోక్‌సభ ఎన్నికలను సజావుగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ సంధ్యారాణి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల శాంతినగర్ ఆదిలాబాద్‌లో పీవో, ఏపీవోలకు ఆదివారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే చురుకుగా పని చేసి జిల్లాకు మంచి పేరు తీసుకరావాలని కోరారు. గతంలో జరిగిన చిన్న చిన్న పొరపాట్లను సరిదిద్దుకొని ముందుకు సాగాలని సూచించారు. ముఖ్యంగా మాక్ పోలింగ్ అనంతరం ఈవీఎంలను ఖచ్చితంగా సీ-ఆర్-సీ చేయాలని, మాక్ పోలింగ్‌కు ముందు పోలింగ్ ఏజెంట్లు సకాలంలో పోలింగ్ స్టేషన్‌కు చేరుకోవాలని చెప్పాలని, బీవీ, వీవీప్యాట్, సీవీలను సరైన పద్ధతిలో అనుసంధానం చేయాలన్నారు. అన్ని రకాల ఫారాలు, సామగ్రిని తీసుకున్న అనంతరం పోలింగ్ స్టేషన్‌కు తరలివెళ్లాలని, పోలింగ్ సరళి నిష్పక్షపాతంగా ఉండాలని సూచించారు. పోలింగ్ ముగిసిన అనంతరం క్లోస్ బటన్ నొక్కడం మరిచిపోవద్దని తెలిపారు. ఈ సందర్భంగా శిక్షణలో పాల్గొన్న వారు అడిగిన పలు ప్రశ్నలకు ఓపికగా సమాధానం ఇచ్చారు. నిష్ణాతులైన రిసోర్స్ పర్సన్లు అందుబాటులో ఉన్నారని, శిక్షణను సరిగా వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ రవీందర్‌రెడ్డి, ఏఎస్‌వో శ్రీధర్‌బాబు, రిసోర్స్ పర్సన్లు సత్యనారాయణ, రాములు, ముజాఫర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

79
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles