కన్నుల పండువగా శోభాయాత్ర

Mon,March 18, 2019 01:15 AM

బోథ్, నమస్తే తెలంగాణ: మండలంలోని కౌఠ (బీ) గ్రామంలో సద్గురు శబరి మాతాజీ ఆశ్రమ ఏడో వార్షికోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. మొదట ఆశ్రమంలోని అమ్మవారి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు. అభిషేకాలు జరిపించారు. అనంతరం డప్పులు, మేళాలతో అమ్మవారి చిత్ర పటాలు, పాదుకలను ట్రాక్టర్‌పై ఉంచి శోభాయాత్ర నిర్వహించారు. భక్తులు ఓం శ్రీరామ జయరామ జయజయరామ, ఓం నమో భగవతే శబరి మాతాయా.. అంటూ శబరి మాతను కొలుస్తూ భజనలు చేశారు. మహిళలు కోలాటం ప్రదర్శిస్తూ నృత్యాలు చేశారు. శోభాయాత్రలో గ్రామంతో పాటు కన్గుట్ట, ధన్నూర్ (బీ), తేజాపూర్, పొచ్చెర, బజార్‌హత్నూర్, దేగామ, పిప్పిరి, తాంసి, తలమడుగు, భీంపూర్, ఆదిలాబాద్‌రూరల్ మండలాల్లోని వివిధ గ్రామాలకు చెందిన వందలాది భక్తులు పాల్గొన్నారు. శోభాయాత్ర అనంతరం దాతల సహకారంతో పాఠశాలలో ఏర్పాటు చేసిన నగర భోజనంలో భక్తులంతా కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. అంతకుముందు భక్తులను ఉద్దేశించి శివానంద భారత స్వామిజీ ప్రవచనాలు బోధించారు. బాలన్న మహరాజ్, దేవన్న మహరాజ్, ఆలయ కమిటీ సభ్యులు బి ప్రభాకర్‌రెడ్డి, ఏ ధర్మారెడ్డి, బి రాజేశ్వర్, ధర్మపురి, ఎన్ ప్రసాద్‌రెడ్డి, మేర్గు గంగాధర్, పి లక్ష్మీనారాయణరెడ్డి, ఏ రాంరెడ్డి, గీతాబాయి తదితరులు పాల్గొన్నారు.

90
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles