పది పరీక్షలు షురూ..

Sun,March 17, 2019 12:26 AM

ఎదులాపురం : పదో తరగతి వార్షిక పరీక్షలు జిల్లా వ్యాప్తంగా శనివారం ప్రారంభమయ్యా యి. ఉదయం 9.30 గంటలకు ప్రారంభమైన ఈ పరీక్షకు విద్యార్థులు ఉదయం 8.30గంటలకే పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకున్నారు. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా కేంద్రాలకు వచ్చి హాల్‌టికెట్ నెంబర్లు ఏ గదుల్లో ఉన్నాయోనని కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన నోటీసు బోర్డుల్లో చూసుకున్నారు. కొంత మంది విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలకు ఆల్ ద బెస్ట్ చెప్పా రు. మొదటి రోజు మొదటి లాంగ్వేజ్ పరీక్షను ని ర్వహించారు. జిల్లాలో మొత్తం 61 పరీక్ష కేంద్రా ల్లో 10,238 మంది విద్యార్థులు హాజరు కావా ల్సి ఉండగా.. 10,173 మంది హాజరయ్యారని, 65 మంది గైర్హాజరయ్యారని అధికారులు తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా విద్యాశాఖ అధికారులు అన్ని సౌకర్యాలను పరీక్షా కేంద్రాల్లో కల్పించారు. మాస్ కాపీయింగ్ అవకాశం లేకుండా ఒక్కో బెంచీకి ఇద్దరు విద్యార్థులను మాత్రమే కేటాయించారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ విధించడంతో పాటు పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. మూడు ఫ్లయింగ్ స్కాడ్ బృం దాలు 37 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశాయి. పట్టణంలో ఎక్కడ కూడా ఒక్క జిరాక్స్ సెంటర్ కూడా తెరిచి ఉండకుండా చర్యలు చేపట్టారు.

జిల్లా వ్యాప్తంగా మొదటి రోజు పరీక్షలు ఎ లాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సజావుగా సాగాయి. జిల్లా కేంద్రంలోని లిటిల్ స్టార్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి డాక్ట ర్ రవీందర్‌రెడ్డి పరిశీలించారు. తాంసి మండలంలోని అందర్‌బంద్ పాఠశాలను తనిఖీ చేసి విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని సం బంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యా ప్తంగా మొదటి రోజు పరీక్షకు 99.37 హాజరు శాతం నమోదైంది.
మాస్‌కాపీయింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు..
వార్షిక పరీక్షల్లో విద్యార్థులు మాస్ కాపీయింగ్‌కు పాల్పడితే సంబంధిత ఇన్విజిలెటర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఈవో రవీందర్‌రెడ్డి హెచ్చరించారు. విద్యార్థులకు ముందుగానే తని ఖీ చేసి పరీక్షా కేంద్రంలోనికి అనుమతించాలన్నారు. పరీక్షా కేంద్రంలో ఎవరైనా విద్యార్థులు మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతూ పట్టుబడితే విద్యార్థిని డిబార్ చేయడంతో పాటు ఇన్విజిలెటర్లపై కూడా శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

87
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles