ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలి : ఎస్పీ

Sun,March 17, 2019 12:25 AM

ఆదిలాబాద్ అర్బన్, నమస్తే తెలంగా ణ: ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలని ఎస్పీ విష్ణు వారియర్ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ సమావేశ మందిరంలో జిల్లా పోలీసు అధికారులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడు తూ.. ఎన్నికలను ప్రశాంత వాతావరణం లో నిర్వహించడానికి కావాల్సిన ఏర్పాట్ల ను చేయాలన్నారు. ఎన్నికల సమయం లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా అనుమానితులు, పాత నేరస్తులను అదుపులోకి తీసుకొని తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేయాలని ఆదేశించారు. నాన్ బెయిలబుల్ వారెంట్‌లపై దృ ష్టి సారించి న్యాయస్థానంలో హాజరు ప ర్చాలని పేర్కొన్నారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం అక్రమ రవాణా కాకుండా జిల్లా సరిహద్దులో నిఘా కొనసాగించాలన్నా రు. లైసెన్స్ కలిగిన ఆయుధాలను వెంట నే స్వాధీనం చేసుకోవాలని తెలిపారు.

బె ల్ట్ షాపులు లేకుండా గట్టి చర్యలు తీసుకోవాలని సూచించారు. మహారాష్ట్ర సరిహద్దులోని బోథ్ మండలంలోని ఘన్‌పూర్, తలమడుగు, లక్ష్మీపూర్, బేల మండలంలోని శంకర్‌గూడ, జైనథ్ మండలంలోని పిప్పర్‌వాడ వద్ద పోలీస్ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జిల్లా సరిహద్దులోని ఉట్నూర్ మండలం కొత్తగూడా, నేరడిగొండ మండలం టోల్‌ప్లాజా వద్ద చె క్‌పోస్టుల వద్ద నిరంతరం వాహనాల తనిఖీలు చేపట్టాలన్నారు. పోలీస్ నిఘా వ్యవ స్థ అత్యంత పటిష్టంగా ఉందని అసాంఘిక, కార్యకలాపాల కదలికలపై ముందుగానే సమాచారం సేకరించే సామర్థ్యం ఉందన్నారు. మరిన్ని కేంద్ర బలగాలను జిల్లాకు రప్పించి సమస్యాత్మక ప్రాంతా ల్లో మోహరించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అదనపు ఎస్పీ కంచమోహన్, డీఎస్పీలు కె.నర్సింహారెడ్డి, బి. డేవిడ్ ఏసుదాస్, సుజూ ఉద్దీన్, స్పెషల్ బ్రాంచ్ ఎస్సై అన్వర్ ఉల్‌హక్, సీఐలు వి. సురేశ్, కె.నాగరాజు, ప్రదీప్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

85
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles