ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉండాలి

Sun,March 17, 2019 12:25 AM

ఆదిలాబాద్ అర్బన్, నమస్తే తెలంగాణ: ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు నిరంతరం అప్రమత్తంగా విధులు నిర్వహిస్తూ మద్యం, డబ్బు పంపిణీ కట్టడి చేయాలని జాయింట్ కలెక్టర్ సంధ్యారాణి అన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎస్‌ఎస్‌టీ, ఎంసీసీ టీం అధికారులు, ఎన్నికల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంయుక్త కలెక్టర్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగా విధులు నిర్వహించి ఎన్నికలను విజయవంతం చేశారో అదే తరహాలో ఈ ఎన్నికలను బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలన్నారు. ఏదైనా సమాచారం అందిన వెంటనే ప్రత్యేక బృందాలు సంఘటన స్థలానికి చేరుకొని తనిఖీలు నిర్వహించాలని సూచించారు. మద్యం, డబ్బు, బహుమతులు పంపిణీ చేసినట్లు ఫిర్యాదులు అందిన వెంటనే తక్షణమే స్పందించాలన్నారు. వీడియో చిత్రీకరణ తప్పనిసరిగా చేపట్టాలని ఆదేశించారు. ముఖ్యంగా చెక్‌పోస్టుల్లో పని చేసే అధికారులు, సిబ్బంది అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా చూడాలని పిలుపునిచ్చారు. సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి సాయిబాబా, ఆర్డీవో సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

59
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles