కెస్లాపూర్‌లో వైద్య బృందం ఇంటింటి సర్వే

Sun,March 17, 2019 12:25 AM

ఇంద్రవెల్లి: ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ గ్రామాల్లో క్షయవ్యాధి నివారణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకొని ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నామని ఎస్‌పీఎం డిపార్ట్‌మెంట్ ప్రొఫెసర్ (కమ్యూనిటీ మెడిసిన్ డిపార్ట్‌మెంట్), రిమ్స్ మెడికల్ కళాశాల వైద్యుడు ప్రశాంత్ సోలంకే అన్నారు. శనివారం ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్ లో ఎస్‌పీఎం డిపార్ట్‌మెంట్ ప్రొఫెసర్(కమ్యూనిటీ మెడిసిన్ డిపార్ట్‌మెంట్) రిమ్స్ మెడికల్ కళాశాల శిక్షణ వైద్యుల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. వైద్య శిబిరానికి వచ్చిన రోగుల ద్వారా రక్తనమునలను సెకరించారు. కెస్లాపూర్ గ్రామంలో శిక్షణ వైద్యులు ఇంటింటికీ తీరుగుతూ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించి క్షయవ్యాధిపై సర్వేలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించిన వైద్య పరీక్షలు చేసి వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించి క్షయవ్యాధి లక్షణలను వివరిస్తున్నామన్నారు. ఆరోగ్య పరంగా వైద్య పరీక్షలు నిర్వహించి దగ్గుదమ్ము ఉన్నవారి లాలాజలంను సెకరించి, రక్త నమునను తీసుకుంటున్నామన్నారు.

సేకరించిన నమూనాలను రిమ్స్‌కు పంపించి వాటికి యంత్రాలతో పరీక్షలు నిర్వహించి వ్యాధిను గుర్తించడం జరుగుతుందన్నారు. గిరిజన గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి క్షయవ్యాధి ఉన్నవారిని గుర్తించి మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు. సమాజంలో క్షయవ్యాధి లేకుండా చేయడంమే లక్ష్యంతో ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలోని తలమడుగ, ఉమ్రి, వాన్‌వట్, మామిడిగూడ, లోకారి, సాయిలింగి గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు మెరుగైన వైద్యం అందించామన్నారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడంతో శిక్షణ వైద్యులకు మరింతగా వ్యాధులపై అవగాహన పెరుగుతుందన్నారు. దీంతో గ్రామాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్‌డబ్ల్యూ కృష్ణలత, పిట్టబొంగురం వైద్యుడు శ్రీధర్, శిక్షణ వైద్యులు తదితరులు పాల్గొన్నారు.

80
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles