టీఆర్‌ఎస్‌లో 120 మంది చేరిక

Sun,March 17, 2019 12:24 AM

భీంపూర్: తాంసి మండలం గోట్కూరి గ్రామానికి చెందిన 120 మంది శనివారం టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. మాజీ మంత్రి, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న.. బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, టీఆర్‌ఎస్ శ్రేణులతో కలిసి శనివారం గోట్కూరి గ్రామాన్ని సందర్శించారు. సర్పంచ్ బెజ్జంకి జయశ్రీ ఆమె భర్త కేశవరావు సహా 120 మంది కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరారు. ఎమ్మెల్యేలు వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూసి అసెంబ్లీ, స్థానిక ఎన్నికల్లో ఆదరించిన ప్రజలు ఎంపీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ టీఆర్‌ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జోగురామన్న కోరారు.

కాంగ్రెస్, బీజేపీల టికెట్లపై అనాసక్తి...
సీఎం కేసీఆర్ పనితీరుతో రాష్ట్ర ప్రగతితో ఇప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరారని ఇపుడు ఎంపీ టికెట్లు తీసుకొన కాంగ్రెస్, బీజేపీల నాయకులకు అపనమ్మకంతో భయం కలుగుతున్నదని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అన్నారు. తాంసిలో వివిధ కుల సంఘాలు, వీడీసీ, యువత ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆదిలాబాద్ ఎంపీగా గోడం నగేశ్‌కు టీఆర్‌ఎస్ టికెట్లు వస్తుందని శ్రేణులన్నీ ఐక్యంగా ఉండి మెజారిటీతో గెలిపించాలని కోరారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో మాలీ సామాజికవర్గ సమస్యలపై చర్చిస్తానని స్పష్టం చేశారు. దళితబస్తీ కోసం భూములు అమ్మిన రైతులకు తాజాగా రూ.17 కోట్లు విడుదలయ్యాయని వెల్లడించారు. తాంసికి సమీప బోడగుట్ట ప్రాంతంలో నాలుగు కల్వర్టులు, మాలీ సంఘ భవన నిర్మాణానికి రూ.7 లక్షలు, విడతల వారీగా 300 డబుల్‌బెడ్‌రూం ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. తాంసికి చెందిన 90 మాలీ కుటుంబాలకు సొంతంగా గుంట భూమి చొప్పున విరాళంగా ఇస్తున్నట్లు సర్పంచ్ స్వప్న, ఆమె భర్త కన్వీనర్ కృష్ణ ప్రకటించారు. రైతుసమితి జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, తాటిపెల్లి రాజు, కన్వీనర్లు కృష్ణ, సంజీవ్‌రెడ్డి, సర్పంచులు సదానందం, వెంకన్న, బెజ్జంకి జయశ్రీ, సరితారెడ్డి, భూమన్న దొర, ఎంపీపీ మంజుల, జడ్పీటీసీ పులి శ్రీలత, నాయకులు కంది గోవర్ధన్‌రెడ్డి , అరుణ నరేశ్, శ్రీధర్‌రెడ్డి, మేకల నాగయ్య, జి.నరేందర్, మంగదుడ్ల శ్రీనివాస్, ఏనుగు అశోక్‌రెడ్డి, ఎం.కల్చాప్‌యాదవ్ , జమునాబాయి, సామ నాగారెడ్డి, రాళ్లబండి శంకర్, గంగారాం, కౌడాల మహేందర్ తదితరులున్నారు. వివిధ కుల సంఘాల ప్రతినిధులు ఎమ్మెల్యేను సన్మానించారు. అంతకుముందు ఎమ్మెల్యే జ్యోతిబాపూలే విగ్రహానికి పూలమాల వేశారు.

84
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles