పోలింగ్ కేంద్రాలు @ 2079

Sat,March 16, 2019 12:32 AM

ఆదిలాబాద్/నమస్తే తెలంగాణ ప్రతినిధి : ఆదిలా బాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఆదిలాబా ద్, బోథ్, ఖానాపూర్, నిర్మల్, మధోల్, ఆసిఫా బాద్, సిర్పూర్ ఏడు అసెంబ్లీ నియో జకవర్గాలు ఉన్నాయి. ఎన్నికల సంఘం గత నెల 22న విడు దల చేసిన ఓటర్ల జాబితా ప్రకారం పార్లమెంట్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 14,78,662 మంది ఉండగా వీరిలో మహిళా ఓటర్లు 7,52,649 మంది, పురుష ఓటర్లు 7,25,961 మంది, ఇతరులు 52 మంది ఉన్నారు. నియో జకవర్గంలో పురుషుల కంటే మహిళా ఓటర్ల సం ఖ్య 26,688 ఎక్కువగా ఉంది. ఎన్నికల్లో పోలిం గ్ నిర్వహణ కోసం పట్టణ ప్రాంతాల్లో 1400 మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రాన్ని, గ్రామీణ ప్రాంతాల్లో 1200 మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే పార్లమెంట్ ఎన్నిక ల్లో ఓటర్ల సంఖ్య సైతం పెరిగింది. ఏజెన్సీ గ్రామా లతో పాటు మారుమూల గ్రామాల్లో ఓటర్ల సం ఖ్య తక్కువగా ఉన్నా దూరభారం, ఎండలతో ఇ బ్బందులు పడకుండా పోలింగ్ కేంద్రాలను ఏ ర్పాటు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు నియో జకవర్గాల్లో 1794 పోలింగ్ కేంద్రాలు ఉండగా ఏప్రిల్ 11న జరిగే పార్లమెంట్ ఎన్నికల కోసం 2079 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే 285 పోలింగ్ కేం ద్రాలు పెరిగాయి. దీంతో గ్రామాల ప్రజలు తమ ఓటు హక్కును ఎక్కువ సంఖ్యలో వినియో గించుకునే అవకాశం లభించడంతో పాటు ఈ ఎ న్నికల్లో ఓటింగ్ శాతం సైతం పెరిగే అవకా శాలున్నాయి.

ఆదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికల నిర్వహణపై ఎన్నికల అధికారి, ఆదిలాబాద్ కలెక్టర్ దివ్య ఇప్పటికే వివిధ శాఖల అధికారులతో సమా వేశాలు నిర్వహించి తగు సూచనలు చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించడంతో పోలింగ్ శాతం గణనీయంగా పెరిగింది. పార్లమెంట్ ఎన్నికల్లో సైతం క్రితంసారి ఎన్నికల కంటే ఈ సారి పోలింగ్ శాతాన్ని పెంచేందుకు కలెక్టర్ అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలపై ప్రత్యే క దృష్టి సారించారు. ఇందులో భాగంగా 226 మంది సెక్టోరియల్ అధికారులను నియ మించా రు. వీరు పోలింగ్ కేంద్రాల్లో వసతులపై దృష్టి సారిస్తారు. నియోజకవర్గం పరిధిలోని ఏజెన్సీ గ్రామాలు ఎక్కువగా ఉండడంతో పాటు ఎండా కాలం కావడంతో ఓటర్లు ఇబ్బందులు పడ కుం డా తమ ఓటుహక్కును వినియోగించు కునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఓటర్లకు అనుకూ లంగా తమ గ్రామాలకు దగ్గర్లోని పోలింగ్ కేంద్రా లను సైతం ఏర్పాటు చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్ పార్లమెంటరీ నియోజ కవర్గ పరిధిలో ఏడు నియోజకవర్గాల పరిధిలో 1794 పోలింగ్ కేంద్రాలు ఉండగా వా టి సంఖ్యను 2079కు పెంచారు. మథోల్ ని యోజక వర్గంలో ఎక్కువగా 311 పోలింగ్ కేంద్రాలు ఉండగా ఆదిలాబాద్ తక్కువగా 280 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఏజెన్సీ మండలాలున్న ఖా నాపూర్ నియోజకవర్గంలో 303, బోథ్‌లో 300, ఆసిఫాబాద్‌లో 300 పోలింగ్ కేం ద్రాలను ఏర్పా టు చేశారు. ఖానాపూర్ నియోజకవర్గంలో ఎక్కు వగా 65 పోలింగ్ కేంద్రాలు పెరిగాయి. ఆదిలా బాద్ అసెంబ్లీ నియోజక వర్గంలో తక్కువగా 19 పోలింగ్ కేంద్రాలను అదనంగా ఏర్పాటు చేశారు.

149
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles