నేటి నుంచి పది పరీక్షలు..

Sat,March 16, 2019 12:32 AM

ఎదులాపురం : జిల్లా వ్యాప్తంగా శనివారం నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఇందు కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లను జిల్లా విద్యాశాఖ అధికారులు పూర్తి చేశారు. పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఈవో డాక్టర్ రవీందర్‌రెడ్డి తెలిపారు. పరీక్షలు ప్రతి రోజూ ఉదయం 9.30గంటల నుంచి మధ్యా హ్నం 12.15గంటల వరకు నిర్వహించనున్నారు. విద్యార్థులను ఉదయం 8.30 గంటల నుంచి పరీక్ష కేంద్రాల్లోకి పంపడానికి అధికారులు ఏర్పాట్లు చేశా రు. జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది 13,576 మంది రెగ్యులర్ విద్యార్థులు పరీక్షలకు హాజరు కానుండగా, ఇందులో ప్రభుత్వ పాఠశాలల నుంచి 10, 098 మంది, ప్రైవేటు పాఠశాలల నుంచి 3478 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. విద్యార్థుల కోసం 61 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పా టు చేశారు.

మాస్‌కాపీయింగ్‌ను నిరోధించేందుకు పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏ ర్పాటు చేశారు. మూడు ఫ్లయింగ్ స్కాడ్ బృందాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఒక్క నిమిషం నిబంధనను సడలించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ను అమలు చేయనున్నారు. ఎవరైనా మాస్ కాపీయింగ్‌కు పాల్పడితే సంబంధిత ఇన్విజిలేటర్ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు తప్పని సరిగా పరీక్ష ప్యాడ్, పెన్నులు, హాల్‌టికెట్‌లు తెచ్చుకోవాలని సూచించారు. సెల్‌ఫోన్లు, పేజర్లు, క్యాలిక్యూలేటర్లు తెచ్చుకోవద్దని సూచించారు. విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా పరీక్ష కేంద్రాల్లో మే ఐ హెల్ప్ యూ కేంద్రాలతో పాటు కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశామని చెప్పారు. విద్యార్థులకు ఇబ్బందులేమైనా ఉంటే నేరుగా డీఈవో సెల్ నంబర్ 7995087618కు ఫోన్ చేయాలన్నారు. జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలను పరిశీలించడానికి ఉమ్మడి జిల్లా పరిశీలకునిగా కరీంనగర్ డైట్ లెక్చరర్ డాక్టర్ శంకర్‌ను ప్రభుత్వం నియమించింది.

99
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles