అంగన్‌వాడీ కేంద్రాల్లో పౌష్ఠికాహారం పంపిణీ

Sat,March 16, 2019 12:31 AM

ఉట్నూర్ రూరల్ : అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా క్రమం తప్పకుండా పౌష్ఠికాహారం అందించేందుకు చర్యలు తీసుకున్నామని కలెక్టర్ దివ్యాదేవరాజన్ అన్నారు. మండలంలోని కొత్తగూడ(జి) గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని శుక్రవారం సందర్శించారు. ఐ డూ స్వచ్ఛంద సంస్థ ద్వారా మండలంలోని 11 అంగన్‌వాడీ కేంద్రాలను ఆదర్శంగా తీర్చిదిద్దారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ కొత్తగూడ(జి) అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించారు. కేంద్రంలోని వంటగది, గోడలపై చిత్రాలు, ఆట వస్తువులు తదితర వసతులను పరిశీలించారు. అక్కడ ఏఎన్‌ఎం చేస్తున్న రక్తపరీక్షలు పరిశీలించారు. తాగునీటి సౌకర్యం కల్పించాలని అధికారులకు ఆదేశించారు. అనంతరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కృష్ణ ఆదిత్యతో కలసి చిన్న సుద్దగూడ గ్రామంలోని అంగన్‌వాడి కేంద్రా న్ని సందర్శించారు. కేంద్రం ఆవరణలో మొక్కను నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ దివ్య మాట్లాడుతూ.. అంగన్‌వాడీ టీచర్లతో పాటు కమిటీలు మెరుగ్గా పనిచేస్తే ప్రజలు చైతన్యవంతం అవుతారని అన్నారు. గర్భిణులు మూడు నెలల్లోపు అంగన్‌వాడీ సెంటర్‌లో పేరు నమో దు చేయించుకోవాలని సూచించారు.

పుట్టిన ప్రతి బిడ్డకూ వెయ్యి రోజుల పాటు పోషకాహారం అందిస్తే బిడ్డ ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. గర్భిణి ఆకు కూరలు, గుడ్లు, పాలు, ఐరన్ మాత్రలు తీసుకోవాలన్నారు. గర్భిణులు క్రమం తప్పకుండా అన్ని రకాల ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రభుత్వ దవాఖానల్లోనే ప్రసవాలు జరిగేలా చూడాలన్నారు. ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి, ఇంకుడుగుంత నిర్మించుకోవాలని తెలిపారు. ఐటీడీఏ పీవో కృష్ణ ఆదిత్య మాట్లాడుతూ.. ఆరేళ్లలోపు పిల్లలకు బాలామృతం అందించడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. అనంతరం వివిధ గ్రామాల నుంచి వచ్చిన కమిటీ సభ్యులు, ఆశ కార్యకర్తలు, అంగన్‌వాడీ టీచర్లు పోషకాహారం అందిస్తున్న తీరుని వివరించారు. సీడీపీవో శ్రావణి, సర్పంచులు మడావి యశోద, ఆత్రం రాహుల్, రాథోడ్ జనార్దన్, జాదవ్ సునీల్, ఉప సర్పంచ్ ఆత్రం తిరుపతి, పేసా జిల్లా కో-ఆర్డినేటర్ వెడ్మ బొజ్జు, మాజీ సర్పంచ్ గంగాధర్, సూపర్‌వైజర్లు ధనలక్ష్మి, సంధ్య, ఐ డూ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి రాకేశ్ రెడ్డి, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

122
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles