హస్తవ్యక్తం

Fri,March 15, 2019 12:18 AM

ఆదిలాబాద్ / నమస్తే తెలంగాణ ప్రతినిధి : పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి విజయం ఖాయంగా మారగా మెజారిటీపైనే గులాబీ పార్టీ నాయకులు దృష్టి సారించారు. ఇందుకోసం పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు. త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు.
టీఆర్‌ఎస్ నాయకులు పార్లమెంట్ ఎన్నికలకు ఇప్పటికే అన్ని విధాలుగా సన్నద్ధం కాగా కాంగ్రెస్ పార్టీలో మాత్రం వర్గపోరు కొనసాగుతున్నది. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నరేశ్ జాదవ్, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖానాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన రాథోడ్ రమేశ్, బోథ్ నుంచి పోటి చేసి ఓడిపోయిన సోయం బాపురావులు టికెట్ ఆశిస్తున్నారు. ముగ్గురు నాయకులు పెద్దల ద్వారా పైరవీలు చేసుకుంటున్నారు. ఎంతోకాలంగా తాను పార్టీకి సేవచేస్తున్నానని ఈ సారి పార్లమెంట్ ఎన్నికల్లో సైతం తనకు టికెట్ ఇవ్వాలని గత పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటి చేసి ఓడిపోయిన నరేశ్‌జాదవ్ ఏఐసీసీ నేతలను కోరారు. హస్తం పార్టీ తరపున రాథోడ్ రమేశ్, సోయం బాపురావుల పేర్లను పరిశీలించడం ఏమిటని ఆయన కాంగ్రెస్ నేతలను అడిగారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఘోర పరాజయం పొంది నిరాశ, నిస్పృహలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలకు వర్గపోరు మింగుడు పడడం లేదు. దీంతో పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలకు ఏమి చేయాలో పాలుపోవడం లేదు. హస్తం పార్టీ టికెట్ ముగ్గురిలో ఒక్కరికి దక్కినా మిగితా వర్గం వారు పార్టీ అభ్యర్థికి సహకరించే అవకాశాలు లేవు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో ఆరు చోట్ల టీఆర్‌ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. ఆసిఫాబాద్ నుంచి గెలుపొందిన అత్రం సక్కు టీఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో పార్లమెంట్ నియోజకవర్గంలో ఏ ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు లేరు. పార్లమెం ట్ ఎన్నికల సందర్భంగా వర్గపోరు తీవ్రమవడంతో పార్టీ పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గా ల్లో టీఆర్‌ఎస్‌కు బలమైన నాయకులు, మంచి క్యాడర్ ఉంది. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు సైతం అన్ని వర్గాల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా మారాయి. ఫలితంగా టీఆర్‌ఎస్ అ భ్యర్థి విజయం ఖాయం కాగా మెజార్టీ పైనే నాయకులు, కార్యకర్తలు దృష్టి సారించారు. హస్తం పార్టీలో అంతర్గత విభేదాలు పార్టీ అధిష్ఠానానికి తలనొప్పిగా మారగా, వివిధ నియోజకవర్గాల్లోని నాయకులు, కార్యకర్తలు తీవ్ర నిరాశ, నిస్పృహకు గురువుతున్నారు.

132
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles