ఎన్నికల నిర్వహణలో అధికారుల పాత్ర కీలకం

Fri,March 15, 2019 12:17 AM

నిర్మల్‌టౌన్ : జిల్లాలో త్వరలో నిర్వహించనున్న లోక్‌సభ, స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారుల పా త్ర కీలకమని నిర్మల్ జాయింట్ కలెక్టర్ భాస్కర్‌రావు అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో గురువారం ఎన్నికల నిర్వహణపై మాస్టర్ ట్రైనర్లకు నిర్వహించిన శిక్షణ తరగతులకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఈ నెల 18 నుంచి జిల్లాల్లో ప్రజలకు విస్తృత అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. ఈవీఎం, వీవీ ప్యాట్స్, ఓటింగ్ విధానంపై ఇప్పటికే ప్రచార రథాల ప్రచారం నిర్వహిస్తున్నామని చెప్పారు. ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బంది, అధికారులు విధి నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడానికి అధికారులు కృషి చేయాలని కోరారు.

మీడియా సెంటర్‌ను పరిశీలించిన జేసీ
నిర్మల్ టౌన్: కలెక్టర్ కార్యాలయంలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేయనున్న మీడియా సెంటర్‌లో కొనసాగుతున్న ఏర్పాట్లను గురువారం జేసీ భాస్కర్‌రావు పరిశీలించారు. మీడియా సెంటర్‌లో కావాల్సిన అన్ని వసతులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. భవనానికి రంగులు వేయడం, ఫర్నిచర్, ఫ్యాన్లు సమాచారానికి సంబంధించిన అన్ని రికార్డులు అందుబాటులో ఉంటాయని వివరించారు. జేసీ వెంట కార్యాలయ పరిపాలన అధికారి కలీం తదితరులున్నారు.

126
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles