పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి

Fri,March 15, 2019 12:17 AM

పెంబి: పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటే ఏ రోగాలు దరిచేరవని నిర్మల్ ఎస్పీ శశిధర్‌రాజు అన్నారు. గురువారం పెంబి పోలీసు స్టేషన్ పరిధిలో మారుమూల గ్రామమైన యాపల్‌గూడలో పోలీసుల ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఖానాపూర్ సీఐ ఆకుల అశోక్ కుమార్, పెంబి ఎస్సై భవాని సేన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరాన్ని ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రోగాలను ముందే గుర్తించి వైద్యం చేయించుకుంటే రోగాలను అరికట్టవచ్చన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నారని, ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నిరుద్యోగుల కోసం ప్రతి ఏడాది పోలీసుశాఖ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తామన్నారు. పోలీసులు ప్రజలకోసమే ఉన్నారని, ఎలాంటి భయం లేకుండా సంప్రదించాలన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. అడవులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. అటవీ, పోలీసు శాఖ సంయుక్తంగా ఫారెస్ట్ ప్రొటెక్షన్ ఫోర్స్ టీంను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.అడవుల్లో వన్య ప్రాణులను వేటాడినా, చెట్లను నరికినా పీడీ యాక్టు కింద కేసు నమోదు చేస్తామన్నారు. హరితహారంలో విరివిగా మొక్కలు నాటాలని కోరారు.

వైద్య శిబిరానికి నిర్మల్, ఖానాపూర్, పెంబి మండలాల నుంచి వివిధ విభాగాలకు చెందిన వైద్య బృందం తరలివచ్చింది. వైద్యులు వేణుగోపాలకృష్ణ, కిరణ్‌కుమార్, భీంరావ్, పెంబి పీహెచ్‌సీ సిబ్బంది, ఏఎన్‌ఎంలు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు. అనంతరం ఎస్పీని గ్రామస్తులు, మండలంలోని సర్పంచులు, టీఆర్‌ఎస్ నాయకు లు సన్మానించారు. కార్యక్రమంలో ఏఎస్పీ దక్షిణమూర్తి, డీఎస్పీ ఉపేందర్‌రెడ్డి, ఖానాపూర్ ఎస్సై ప్రసాద్, యాపల్‌గూడ సర్పంచ్ చంద్రకళ, ఎంపీటీసీలు, టీఆర్‌ఎస్ నాయకులు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

87
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles