అన్నదాతకు సర్కారు చేయూత

Fri,March 15, 2019 12:16 AM

భీంపూర్ : రాష్ట్ర ప్రభుత్వం సగటు రైతు సంక్షేమం కోసం పథకాలు సమర్థవంతంగా అమలు చేస్తున్నదని ఆయా పంటలకు మద్దతు ధరలతో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నదని వీటిని సద్వనియోగం చేసుకోవాలని ఆదిలాబాద్ మార్క్‌ఫెడ్ ఎండీ పుల్లయ్య అన్నారు. తాంసి మార్క్‌ఫెడ్ గోడౌన్ ఆవరణలో ఆయన పీఏసీఎస్ సీఈవో లక్ష్మణరాజుతో కలిసి గురువారం శనగ కొనుగోలు కేం ద్రాన్ని ప్రారంభించారు. క్వింటాకు రూ. 4,620 మద్దతు ధరతో శనగలు తీసుకుంటున్నామని రైతులు ప్రైవేటుగా అమ్మి మోసపోవద్దని సూచించారు. శనగ రైతులకు పంట బీమా ప్రీమియం ఉన్నదని ఉపయోగించుకోవాలన్నారు. కొనుగోలు కేంద్రాలకు దళారులు వస్తే సమాచారం ఇవ్వాలని కోరారు. నిర్ణీత తేదీల్లో గ్రామాల వారీగా రైతులు కేంద్రంలో తమ శనగలను అమ్ముకోవాలన్నారు. డబ్బులు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామన్నారు.
శనగ పంటను అమ్మే రైతులు తమ ఆధార్, బ్యాంకు ఖాతా పుస్తకం, పట్టాదారు పాసుపుస్తకం వెంట తీసుకురావాలని సూచించారు. రైతులు కిసాన్‌మిత్ర సహకారం తీసుకోవాలన్నారు. పీఏసీఎస్ కార్యదర్శులు కర్నేవార్ గణేశ్, గంగారెడ్డి, ఆశన్న , కేశవ్ సిబ్బంది తదితరులు ఉన్నారు.

93
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles