అవగాహన పెంపొందించుకోవాలి

Fri,March 15, 2019 12:16 AM

ఎదులాపురం: లోక్‌సభ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అన్ని విషయాలపై ఉపాధ్యాయులు, పీవో, ఏపీవోలు అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని కలెక్టర్ దివ్యదేవరాజన్ అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని పురుషుల డిగ్రీ కళాశాలలో లోక్‌సభ ఎన్నికల నిర్వహణ శిక్షణలో భాగంగా పీవో, ఏపీవోలకు శిక్షణ తరగతులకు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇదివరకే రెండు ఎన్నికలను సజావుగా నిర్వహించారని, అదే అనుభవంతో లోక్‌సభ ఎన్నికలను సైతం సజావుగా పూర్తి చేయాలని సూచించారు. ఈవీఎం, వీవీప్యాట్‌ల పనితీరుపై అవగాహన కల్పించారు. పోలింగ్ సందర్భంగా అనుసరించాల్సిన నిబంధనలు పక్కాగా అమలు చేయాలని సూచించారు. ఎన్నికల విధులు నిర్వహించే వారికి అదే పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేలా ఈడీసీ ఎలక్షన్ డ్యూటి సర్టిఫికెట్ తీసుకుంటున్నామన్నారు. పోస్టల్ బ్యాలెట్ కాకుండా ఏ పోలింగ్ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్నారో అక్కడే ఓటుహక్కును వినియోగించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో జేసీ సంధ్యారాణి, అసిస్టెంట్ కలెక్టర్ గోపి, విద్యాశాఖ అధికారి రవీందర్‌రెడ్డి, ఆర్డీవో సూర్యనారాయణ, కలెక్టరేట్ సూపరింటెండెంట్ వర్ణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

విద్యార్థులు పోటీతత్వాన్ని అలవర్చుకోవాలి
ఎదులాపురం: విద్యార్థి దశ నుంచే ప్రతి ఒక్కరూ పోటీతత్వాన్ని అలవర్చుకోవాలని డీఈవో డాక్టర్ రవీందర్‌రెడ్డి అన్నారు. సైన్స్‌డే సందర్భంగా జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు డీఈవో బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జన విజ్ఞాన వేదిక నిర్వహిస్తున్న పోటీలు అభినందనీయమన్నారు. ప్రతి ఏడాది సైన్స్ డే రోజు పోటీలు నిర్వహించి విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఎంతగానో ఉపయోగ పడుతాయన్నారు. వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. మొదటి బహుమతి గుడిహత్నూర్ మండలం జడ్పీఎస్‌ఎస్ మన్నూర్ 9వ తరగతి కె.నీత, రెండో బహుమతి సోనాల జడ్పీఎస్‌ఎస్ 9వ తరగతి ఎస్.పండిత్, మూడో బహుమతి తాంసి మండలం కప్పర్ల జడ్పీఎస్‌ఎస్ 9వ తరగతి మీనాలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఈవో కార్యాలయ ఏడీ సుధాకర్, పీజీహెచ్‌ఎం నారాయణ, జేవీవీ వైస్ ప్రెసిడెంట్ రాజేంద్రప్రసాద్, జన విజ్ఞాన వేదిక ప్రధాన కార్యదర్శి రవీందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

సాంగిడికి ఆధ్యాత్మిక శోభ
బేల: మండలంలోని సాంగిడి గ్రామంలో వారం రోజులుగా కొనసాగుతున్న ఆధ్యాత్మిక గురువు సంత్ మోతీజీ మహరాజ్ 21వ పుణ్యతిథి వేడుకలు గురువారంతో ముగిశాయి. చివరి రోజు మహరాజ్ పల్లకీ ఊరేగింపు వైభవంగా సాగింది. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్, జోగు ఫౌండేషన్ చైర్మన్ జోగు ప్రేమేందర్, సర్పంచ్ కన్నాల సుమన్‌బాయి, గంగన్న, మాజీ సర్పంచ్ బాల్‌చందర్, వీడీసీ అధ్యక్షుడు గోవింద్‌రెడ్డి, శిష్యులు కిష్టారెడ్డి, ప్రభాకర్, సంజీవ్, దయాకర్‌రెడ్డి, శివాజీ, మహేందర్, టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు సంతోష్ బెదుల్కర్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

84
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles