పదో రోజు@440 మంది!

Fri,March 15, 2019 12:15 AM

ఆదిలాబాద్ అర్బన్, నమస్తే తెలంగాణ: జిల్లాకేంద్రంలోని ఏఆర్ పరేడ్ మైదానంలో కొనసాగుతున్న కానిస్టేబుల్, ఎస్సై అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ గురువారం నాటికి పదో రోజుకు చేరుకుంది. 880 మంది హాజరు కాగా.. 440 మంది అర్హత సాధించారు. 440 మంది అనర్హత సాధించారు. తెల్లవారుజామున 3 గంటల నుంచే అభ్యర్థులను పరేడ్ మైదానంలోకి అధికారులు అనుతించారు. బయోమెట్రిక్ ద్వారా వేలిముద్రలు సేకరించారు. ఆ తర్వాత ధ్రువపత్రాలను పరిశీలించి ఎత్తు, చాతి కొలతలను తీసుకున్నారు. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులను మిగతా ఈవెంట్స్‌లకు అనుమతించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు ఎంపిక ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు జరుగకుండా నూతన సాంకేతిక పరిజ్ఞానంతో ఈవెంట్స్‌లను నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి ఈవెంట్ వీడియో కెమెరాల ద్వారా రికార్డ్ చేస్తున్నామని చెప్పారు. అప్పటికప్పుడు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నామన్నారు. మారుమూల గ్రామాల అభ్యర్థులవి కొందరివి బయోమెట్రిక్‌లో వేలిముద్రలు రాకపోవడంతో ఫింగర్ ప్రింట్స్‌ను తీసుకుంటున్నామన్నారు. ఎంపిక రోజు తీసుకున్న వేలిముద్ర తుదిరాత పరీక్ష రోజు తీసుకున్న వేలిముద్ర మ్యాచ్ అయితేనే ఆ అభ్యర్థిని పరీక్ష హాల్‌లోకి అనుమతిస్తామన్నారు. బయోమెట్రిక్‌లో వేలిముద్రలు రాని అభ్యర్థులకు ఫింగర్ ప్రింట్స్ తీసుకొని అనుమతి ఇస్తామన్నారు. ప్రతిభ ఉన్న అభ్యర్థులకు ఉద్యోగాలు వస్తాయని పేర్కొన్నారు. తుదిరాత పరీక్షకు ఎంపికైన అభ్యర్థులు పరీక్షకు సిద్ధం కావాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎస్పీలు కంచ మోహన్, దక్షిణమూర్తి, గోద్రు, డీఎస్పీలు కె.నర్సింహారెడ్డి, కిషన్ సింగ్, ఎల్‌సీ నాయక్, నాగయ్య, వెంకట్‌రెడ్డి, ఉపేందర్‌రెడ్డి, డీపీవో కార్యాలయం ఏవో అశోక్ కుమార్ వశిష్ట్, ఆర్‌ఐలు సుధాకర్, వామనమూర్తి, శేఖర్‌బాబు, సీఐలు, ఎస్సైలు, ఐటీ కోర్ వైద్య బృందం, ఫింగర్ ప్రింట్ టీం సభ్యులు పాల్గొన్నారు.

92
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles