పింఛన్ డబ్బుల కోసం.. శాంతి భధ్రతల పరిరక్షణకే కార్డన్ సెర్చ్

Fri,March 15, 2019 12:15 AM

కుంటాల : జిల్లాలో శాంతిభద్రతలను అదుపులో ఉంచి ప్రజలు ప్రశాంత వాతావరణంలో జీవించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ శశిధర్ రాజు అన్నారు. గురువారం మండలంలోని అందకూర్ గ్రామంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. పోలీసుల తనిఖీల్లో అనుమతి పత్రాలు లేని 70 ద్విచక్రవాహనాలు, నాలుగు ఆటోలు, అనుమతి లేకుండా బెల్టు షాపు నిర్వహిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని రూ. 5వేల విలువ చేసే మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ గ్రామస్తులతో మాట్లాడారు. ప్రజల భాగస్వామ్యంతోనే నేరాలను తగ్గించవచ్చన్నారు. హెల్మెట్ లేకుండా ద్విచక్రవాహనాలు నడిపితే జరిగే ప్రమాదాలు, నష్టాల గురించి ఆయన ప్రజలకు వివరించారు. రోడ్డు భధ్రత నియామాలు ప్రతి ఒక్కరూ పాటించినప్పుడే ప్రమాదాలను నివారించవచ్చన్నారు. గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆయన పరిశీలించారు. మండలంలోని కల్లూర్, అందకూర్, లింబా (కే), ఓలా, లింబా (బీ), కుం టాల, అంబకంటి, విఠాపూర్ గ్రామాల్లో ప్రజల భాగస్వామ్యంతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు. నిరంతరం సీసీ కెమెరాల పర్యవేక్షణలో గ్రామాలు ప్రశాంతంగా ఉంటున్నాయన్నారు. అపరిచిత వ్యక్తులు సంచరిస్తే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానంతో ప్రజలకు చేరువయ్యేందుకు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని వివరించారు. శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులకు సహకరిం చాలని గ్రామస్తులకు సూచించారు. కార్యక్రమంలో భైంసా డీఎస్పీ రాజేశ్ భల్లా, సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్సై సునిల్ కుమార్, సర్పంచ్ దాసరి కిషన్, ఎంపీపీ గంగామణి బుచ్చన్న, పోలీసు సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

80
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles