భార్యను హతమార్చిన భర్త !

Fri,March 15, 2019 12:15 AM

ఆదిలాబాద్ రూరల్: ఆదిలాబాద్ రూరల్ మండలంలోని లోకారి గ్రామంలో గురువారం రాత్రి భార్యనే హతమార్చిన ఉదంతం చోటు చేసుకున్నది. కూరేవార్ లక్ష్మి అనే దివ్యాంగురాలిని కట్టుకున్నవాడే గొంతు నులిమి హతమార్చడమే కాకుండా ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించాడు. ఈ సంఘటనకు సంబంధించి ఆదిలాబాద్ రూరల్ ఎస్సై హరిబాబు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న పింఛన్ పొందుతున్న లక్ష్మితో భర్త యువరాజ్ పింఛన్ డబ్బులు ఇవ్వాలని గొడవకు దిగాడు. ఆమె డబ్బు ఇవ్వడానికి నిరాకరించడంతో ఆవేశంలో ఆమె గొంతు నులిమి హత్యచేశాడు. తర్వాత ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించాడు. ప్రతిసారి పింఛన్ డబ్బుల కోసం భార్యతో గొడవపడే యువరాజ్ ప్రవర్తనపై గ్రామస్తులకు అనుమానం రావడంతో పోలీసులకు సమాచారమిచ్చారు. వారు వచ్చేవరకు యువరాజ్‌ను తమ అదుపులో ఉంచుకున్న గ్రామస్తులు తర్వాత పోలీసులకు అతన్ని అప్పగించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు అనుమానం రావడంతో యువరాజ్‌ను విచారించగా, తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. వీరికి 12 ఏళ్ల శ్రావణి అనే కూతురు ఉందని, ప్రస్తుతం ఆమె మేనమామ ఇంటికి వెళ్లడంతో యువరాజ్ ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టు తెలుస్తున్నది.

93
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles