ఉన్నత శిఖరాలను అధిరోహించాలి


Tue,February 19, 2019 12:38 AM

సిరికొండ: పదో తరగతి విద్యార్థులు ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జిల్లా విద్యాధికారి రవీందర్‌రెడ్డి అన్నారు. సిరికొండ మండలం కుంటగూడ, రాంజీగూడ, చెమ్మాన్ గూడతో పాటు సోమవారం మండల కేంద్రంలో ఉన్న జడ్పీ సెకండరీ పాఠశాలను డీఈవోసందర్శించారు . ఈ సందర్భంగా పాఠశాలల్లోని పలు రికార్డులను పరీశీలించారు. సిరికొండలోని జడ్పీ పాఠశాలలో ఈ సందర్భంగా డీఈవో పదో వతరగతి విద్యార్థులతో మాట్లాడారు. వచ్చే నెల 16 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం అవుతాయన్నారు. ఇప్పటికే పరీక్షల షెడ్యూల్ వెలువడిందని, పరీక్షలు నిర్వహిస్తున్నమన్నారు. కలెక్టర్ దివ్యదేవరాజన్ పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సాధించారని చెప్పారు. వార్షిక పరీక్షల పట్ల విద్యార్థులకు భయపడొద్డని, సాధారణ పరీక్షగానే చూడాలన్నారు.వంద శాతం ఉత్తీర్ణత సాధించి ఉపాధ్యాయులకు, తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలన్నారు.ప్రతిరోజు ప్రత్యేక తరగతులకు హాజరు కావాలని సూచించారు. విద్యార్థులు ప్రణాళికతో చదవుతే ఉత్తమ మార్కులు సాధించవచ్చన్నారు. విద్యార్థులకు చదవుతో పాటు క్రమశిక్షణ ఉండాలన్నారు. ప్రతిరోజు సబ్జెక్టు బోధించే ఉపాధ్యాయుడు ఆ సబ్జెక్టుకు సంబంధించిన పరీక్షలను నిర్వహించి విద్యార్థులకు పరీక్ష విధానం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించేలా చొరవ చూపాలని ఉపాధ్యాయులకు ఆదేశించారు. అనంతరం పదో తరగతి విద్యార్థులకు సబ్జెక్టుకు సంబంధించిన కొన్ని ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. విద్యార్థులు సమాధానాలు చెప్పడంతో డీఈవో సంతృప్తి వ్యక్తం చేశారు. డీఈవో వెంట పాఠశాల ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయుడు రాధాకృష్ణ, నవనీత్, సీఆర్‌పీ రవీందర్, సురేశ్ తదితరులు ఉన్నారు.

262
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles