అవయవదానానికి సంకల్పం


Sun,February 17, 2019 11:59 PM

-ఘనంగా సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు
-ఆదిలాబాద్, ఇచ్చోడలో అవయవదానాలకూ నిర్ణయం
ఆదిలాబాద్ / నమస్తే తెలంగాణ ప్రతినిధి : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను ఆదివారం ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభి మానులు, ప్రజలు, విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. ఆదిలాబాద్, ఇచ్చోడలో పలు వురు తమ అవయవదానాలకు ముందుకురాగా, ఇచ్చోడ మండలం ముక్రా(కే)లో దళి తబస్తీ లబ్ధిదారులు తమ పంటపొలాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఆదిలాబాద్‌లో జోగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన అవయవదాన కార్య క్రమానికి ఎమ్మెల్యే జోగు రామన్న, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఇచ్చోడలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో అవాయవదానం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్‌లో వందమంది, ఇచ్చోడలో 15 మంది తమ కండ్లను దానం చేసేందుకు అంగీకార పత్రాలను అందజేశారు. జోగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో రిమ్స్‌లో రోగులు, బంధువులకు అన్నదానం చేశారు. ఇచ్చోడ మండలం ముక్రా (కే)లో దళితబస్తీ భూముల లబ్ధిదారులు తమ పంటపొలాల్లో ముఖ్యమంత్రి చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వ హించారు. ఈ గ్రామంలో దళితబస్తీ పథకంలో భాగంగా 33 మంది లబ్ధిదారులకు 99 ఎకరాల భూమిని ఉచితంగా వారు మూడేళ్లుగా రెండు పంటలను సాగుచేస్తూ ఉపాధి పొందుతున్నారు. ఎన్నో ఏళ్లుగా కూలీ పనులు చేసుకుంటూ జీవించిన తాము సీఎం కేసీఆర్ దయతో రైతులుగా మారామని లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. జిల్లాలోని ఉట్నూర్, బోథ్, ఇచ్చోడ ప్రాంతాలతో పాటు ఏజెన్సీ గ్రామాల్లో సైతం ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. నాలుగున్నర ఏళ్లుగా సీఎం దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని దీంతో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని వేడుకల్లో పాల్గొన్న ప్రజాప్రతినిధులు, నాయకులు అన్నారు.

70
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles