సమ్మాన్ సగం మందికే..


Sat,February 16, 2019 01:06 AM

ఆదిలాబాద్ / నమస్తే తెలంగాణ ప్రతినిధి : వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం గత ఏడాది నుంచి రైతుబంధు పథకాన్ని అమలు చేస్తున్నది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రైతుబంధు పథకాన్ని స్ఫూర్తిగా తీసుకొని కిసాన్ సమ్మాన్ నిధి పేరిట దేశ వ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపింది. రైతుబంధు పథకంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఎకరాకు గత ఏడాది రూ.8 వేలు ఉచితపెట్టుబడి సాయాన్ని రైతులకు పంపిణీ చే సింది. ఈ సంవత్సరం వానాకాలం నుంచి ఎకరాకు రూ.10 వేలను పంపిణీ చేయనుంది. కేంద్ర ప్రభు త్వం అమలు చేయనున్న కిసాన్ సమ్మాన్ పథకం ప్ర క్రియ జిల్లాలో ప్రారంభమైంది. వ్యవసాయ విస్తరణ అధికారులు తమ క్లస్టర్ల పరిధిలోని గ్రామాల్లో రైతుల తో మాట్లాడి లబ్ధిదారుల వివరాలు సేకరిస్తున్నారు. ఈ పథకం నిబంధనల ప్రకారం జిల్లాలో రైతుబంధు పథకంతో ప్రయోజనం పొందుతున్న రైతుల్లో సగం మందికి మాత్రమే కిసాన్ సమ్మాన్ నిధి వర్తించే అవకాశాలున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంటున్నారు. ఫలితంగా కేంద్ర ప్రభుత్వ పథకంపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో వివరాల సేకరణకు వెళ్లిన అధికారులకు రైతుల నుంచి స్పందన కరువవుతున్నది.


ప్రారంభమైన ఎంపిక ప్రక్రియ..
రైతుబంధు పథకం స్ఫూర్తిగా కేంద్రం ప్రభుత్వం ఇటీవల బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన కిసాన్ సమ్మాన్ నిధి పథకం అమలుకు అర్హుల ఎంపిక ప్రక్రియ గురువా రం నుంచి జిల్లావ్యాప్తంగా ప్రారంభమైంది. జిల్లాలో 92 వ్యవసాయ క్లస్టర్లు ఉండగా.. ఆయా క్లస్టర్లలో వ్య వసాయ విస్తరణ అధికారులు తమ పరిధిలోని గ్రా మాల్లో పర్యటిస్తూ లబ్ధిదారుల వివరాలు సేకరిస్తున్నా రు. తమ వద్ద ఉన్న రైతుల సమాచారంతో నిబంధన ల ప్రకారం గ్రామాల్లో లబ్ధిదారులను గుర్తిస్తున్నారు. అర్హతలున్న రైతులను గుర్తించి వారి పేర్లను కిసాన్ స మ్మాన్ నిధి పథకం లబ్ధిదారుల జాబితాలో చేర్చుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు పథకం ద్వారా సాయం పొందుతున్న రైతుల్లో సగం మందికి కిసాన్ సమ్మాన్ నిధి పథకం వర్తించద ని తెలుస్తుంది. నిబంధనల ప్రకారం గ్రామాల్లో చాలా మంది రైతులు ఈ పథకానికి అనర్హులుగా తేలుతున్నా రు. రేషన్‌కార్డు ఆధారంగా లబ్ధిదారుల వివరాలు సేకరిస్తున్నామని, కుటుంబంలో అందరికీ కలిపి ఐదు ఎ కరాల లోపు మాత్రమే భూమి ఉండాలని అధికారు లు అంటున్నారు. ఓ కుటుంబంలో ముగ్గురికి తలా రెండెకరాలున్నా వారికి కిసాన్ సమ్మాన్ నిధి పథకం వర్తించదని చెబుతున్నారు.

రైతుల్లో అసంతృప్తి..
కేంద్రం అమలు చేయనున్న ఈ పథకం తీరుపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 1.18 లక్షల మంది రైతులు ఉండగా.. ప్రస్తుతం ఈ పథకం లో 50 వేల మంది రైతులకు మాత్రమే లబ్ధి చేకూరే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు అం టున్నారు. ఓ కుటుంబానికి ఐదు ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్నా కిసాన్ సమ్మాన్ పథకానికి అ ర్హులు కారు. జిల్లాలో 92 వ్యవసాయ క్లస్టర్లు ఉండ గా.. వ్యవసాయ విస్తరణ అధికారులు క్లస్టర్ల వారీగా లబ్ధిదారుల వివరాలు సేకరిస్తున్నారు. గురువారం నుంచి ప్రారంభమైన ఈ ప్రక్రియ ఈ నెల 18 వరకు కొనసాగునుంది.

రైతు బంధు లబ్ధిదారులు 1,34,577 మంది..
తెలంగాణ ప్రభుత్వం గత ఏడాది వానాకాలం నుంచి జిల్లా వ్యాప్తంగా 1,34,577 మంది రైతులకు ఎకరాకు రూ.8 వేల చొప్పున ఉచిత పెట్టుబడిని పం పిణీ చేసింది. జిల్లాలో 1,16,920 మంది రైతులకు రెవెన్యూ పట్టాలు ఉండగా.. ఏజెన్సీ ప్రాంతాల్లోని 17,657 మంది గిరిజన రైతులకు ఆర్‌వోఎఫ్‌ఆర్ ప ట్టాలున్నాయి. మొత్తం 1,34,577 మంది రైతులకు గానూ వానాకాలంలో ఎకరాకు రూ.4 వేల చొప్పున రూ.210.43 కోట్లను ప్రభుత్వం చెక్కుల రూపంలో పంపిణీ చేసింది. రెండో పంట యాసంగికి గానూ ఎకరాకు రూ.4 వేల చొప్పున అధికారులు రైతుల వివరాలను అధికారులకు పంపిణీ చేయగా.. రైతుల బ్యాంకు అకౌంట్లలో డబ్బులు జమయ్యాయి. రెండు పంటలకు గానూ ఎకరానికి రూ.8వేల చొప్పున రూ.420.86 కోట్లను సర్కారు రైతులకు అందజేసిం ది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతుబంధు పథకం కింద రైతులకు అందించే సహాయాన్ని ఎకరాకు రూ.10 వేల చొప్పున పంపిణీ చే యనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఈ ఏడాది నుంచి జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతులకు వానాకాలం పంటల సాగుకోసం రూ.5 వేలు, యాసంగి పె ట్టుబడుల కోసం రూ.5వేల చొప్పున రైతులకు అందించనున్నారు.

కిసాన్ సమ్మాన్ నిధి నిబంధనలు..
తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిబంధనలు లే కుండా రైతుబంధు పథకాన్ని అమలు చేస్తున్నది. గుంట నుంచి మొదలుకొని వ్యవసాయ భూమి ఎన్ని ఎకరాలున్నా ప్రతి రైతుకూ గుంటకు రూ.100 చొ ప్పున ఎకరానికి రూ. 4వేల చొప్పున రెండు పంటల కు గానూ రూ.8వేలను పంపిణీ చేస్తున్నది. కేంద్ర ప్ర భుత్వం ప్రకటించిన కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో పలు నిబంధనల కారణంగా తక్కువ మంది రైతులు లబ్ధిదారులుగా గుర్తింపు పొందుతున్నారు. ఈ పథకం లో ఐదు ఎకరాల్లోపు వ్యవసాయ భూమి ఉన్న రైతులకు ప్రతి సంవత్సరానికి రూ.6 వేలను మూడు విడతలుగా కేంద్రం ఇవ్వనుంది. ఐదెకరాల లోపు భూమి ఉన్న గత ఏడాది ఆదాయపన్ను కట్టిన వారు, వృత్తి నిపుణులైన డాక్టర్లు, ఇంజినీర్లు, లాయర్లు, ఛార్టెడ్ అ కౌంట్స్, ఆర్కిటెక్ట్స్, సొంత ప్రాక్టీసు కలిగిన వారు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, పీఎస్‌ఈ, అనుబంధ కార్యాలయాలు, రాష్ట్ర ఆధీనంలో ఉన్న స్వతంత్ర సం స్థలు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ సర్వీసుల్లో ఉన్న ఉ ద్యోగులు, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి అనర్హులుగా ప్రకటించారు. వీరితో పాటు గతంలో లేదా ప్రస్తుతం ఎలాంటి రాజ్యాంగ, పోస్టుల్లో విధులు నిర్వహించినా, పూర్వం, ప్రస్తుతం మంత్రులు, లోకసభ సభ్యులు, అసెంబ్లీ, కౌన్సిల్, కార్పొరేషన్ మేయర్, జడ్పీ చైర్మన్‌గా పనిచేస్తున్నవారికి ఐదెకరాల భూమి ఉన్నా వారు అనర్హులుగా పరిగణించబడుతారు.

స్పందన కరువు..
జిల్లావ్యాప్తంగా గురువారం నుంచి ప్రారంభమైన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి లబ్ధిదారుల ఎంపికకు గ్రా మాల్లో రైతుల నుంచి స్పందన కరువైంది. ఐదెకరాలలోపు భూమి ఉన్న రైతుల వివరాలతో ఏఈవోలు గ్రా మాల్లో వివరాలను సేకరిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతా ల్లో ఐదెకరాలకు మించి భూమి ఉన్నా పంటలు సరిగా పండక వారు పేద రైతులుగా ఉన్నారు. కేంద్రం విధించిన నిబంధనలపై వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా రు. జిల్లా వ్యవసాయశాఖ అధికారులు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు.

325
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles