వినియోగదారులకు మెరుగైన సేవలు


Wed,February 13, 2019 11:51 PM

ఆదిలాబాద్ అర్బన్, నమస్తేతెలంగాణ : విజయ పాల వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తానని టీడీడీసీ చైర్మన్ లోక భూమారెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తనపై నమ్మకంతో డెయిరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారని, రెండు సంవత్సరాలుగా పాడి పరిశ్రమ సంస్థ అభివృద్ధికి తాను ఎంతో కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇటీవల ఇంటర్నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ సమ్మిట్-2019లో ఆహార నాణ్యత రంగంలో విజయ డెయిరీకి జాతీయ స్థాయిలో అవార్డు రావడం గర్వకారణంగా ఉందన్నారు. రెండేళ్ల కిందట 1.5 లక్షల నుంచి రెండు లక్షల లీటర్ల వరకు రోజు పాల సేకరణ జరిగేదని, ప్రస్తుతం ఐదు లక్షల లీటర్ల వరకు పాలను సేకరిస్తున్నట్లు తెలిపారు. గతంలో రెండు లక్షల లీటర్ల పాల విక్రయాలుంటే ప్రస్తుతం నాలుగు లక్షల లీటర్ల వరకు పాలను విక్రయిస్తున్నట్లు చెప్పారు.


విజయ డెయిరీని మరింత అభివృద్ది చేసి స్వేత విప్లవం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. పాలతో పాటు పాల ఉత్పత్తులను అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలకు సరఫరా చేస్తున్నామని, పాలతో మిఠాయిలు, పెరుగు, పన్నీరు, బటర్ మిల్క్ వంటి పదార్థాలను తయారు చేస్తూ లాభాపేక్ష లేకుండా ప్రజలకు మెరుగైన సేవలందిస్తున్నామని దీంతో జాతీయ స్థాయి అవార్డు లభించిందని తెలిపారు. విజయ డెయిరీపై కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, ప్రజలు వాటిని నమ్మవద్దని సూచించారు. విజయ డెయిరీకి పాలు విక్రయించే రైతులకు నాలుగు శాతం ఇన్సెంటీవ్ ఇస్తూ 50శాతం సబ్సిడీపై గేదేలను సరఫరా చేయడంతో పాల సేకరణ పెరిగిందని చెప్పారు. రైతు బిడ్డగా తనకు అవార్డు రావడం సంతోషంగా ఉందని భూమారెడ్డి తెలిపారు. సమావేశంలో రైతు సంఘం నాయకుడు గోవర్ధన్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నాయకుడు ఇజ్జగిరి నారాయణ పాల్గొన్నారు.

320
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles