పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి


Wed,February 13, 2019 11:51 PM

ఆదిలాబాద్ అర్బన్, నమస్తే తెలంగాణ : ఈ విద్యా సంవత్సరంలో మార్చి 16 నుంచి ఏప్రిల్ రెండో తేదీ వరకు జరుగనున్న పదో తరగతి వార్షిక పరీక్ష లు పకడ్బందీగా, అన్ని శాఖాధికారులు సమన్వయంతో నిర్వహించాలని కలెక్టర్ దివ్యదేవరాజన్ అన్నారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో పదో తరగతి నిర్వహణ ఏర్పాట్లపై కలెక్టర్ వివిధ శాఖల అ ధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పదో తరగతి వార్షిక పరీక్షలో వందశాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాలలకు ఇ న్సెంటీవ్‌లు ఇస్తామని తెలిపారు. జిల్లాలో 10,098 మంది రెగ్యులర్, 3478 మంది ప్రైవేట్ విద్యార్థులు పరీక్షలు రాస్తారని చెప్పారు. ఇందు కోసం రెగ్యులర్ విద్యార్థులకు 46, ప్రైవేట్ విద్యార్థులకు 15 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు, స్ట్రాంగ్ రూముల ఆర్మీ గార్డులు, ైప్లెయింగ్ స్కాడ్‌తో పో లీసు సిబ్బందిని నియమించాలన్నారు.


జిల్లా కేంద్రం నుం చి ఆయా పరీక్షా కేంద్రాల పరిధిలోని స్టోరేజ్ పాయింట్‌కు ప్రశ్నపత్రాల పంపిణీ సమయంలో ఎస్కార్ట్ సమకూర్చాలని తెలిపారు. ఫార్మళ్లను ఎప్పటికప్పుడు పంపించడం కోసం పరీక్ష నిర్వాహకులకు సహకరించాలని పోస్టల్ అధికారులను ఆదేశించారు. పరీక్ష ప్రతిరోజూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు ఉంటుందని, ఆ సమయంలో ఆయా కేంద్రాల పరిధిలోని జిరాక్స్ సెంటర్లను మూసి ఉంచాలన్నారు. పరీక్షా కేంద్రాల్లో అత్యవసర మందులు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని వైద్యశాఖ అధికారులకు ఆదేశించారు. తాగునీరు, విద్యుత్తు సరఫరా ఉండేలా చూసుకోవాలన్నారు. విద్యార్థులకు రివిజన్ నిర్వహించాలని డీఈవో రవీందర్‌రెడ్డికి తెలిపారు. సమావేశంలో డీఎంహెచ్‌వో డాక్టర్ రాజీవ్‌రాజ్, మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

115
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles