ఏడాది పొడువునా ఉచిత శిక్షణ

Tue,February 12, 2019 11:05 PM

-స్టడీ సర్కిళ్లకు భవనాలు
-ఎమ్మెల్యే జోగు రామన్న
-దస్నాపూర్‌లో బీసీ స్టడీ సర్కిల్ భవనం ప్రారంభం
-అన్ని జిల్లాల్లో ఏర్పాటుకు కృషి
-టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే అన్ని శాఖలకు పక్కా భవనాలు
ఎదులాపురం : గత ప్రభుత్వాల హయాంలో ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలైన సమయంలోనే స్టడీ సర్కిళ్ల తలపులు తెరిచేవని, ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ హయాంలో 365రోజులు స్టడీ సర్కిళ్లలో ఉచిత భోజన వసతితో పాటు శిక్షణ ఇస్తున్నామని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని దస్నాపూర్‌లో రూ.3.75కోట్లతో నిర్మించిన బీసీ స్టడీ సర్కిల్ భవనాన్ని ఆయన మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రామన్న మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో గురుకులాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. జిల్లాల విభజన అనంతరం అన్ని జిల్లా కేంద్రాల్లో స్టడీ సర్కిళ్ల ఏర్పాటుకు సీఎం సుముఖంగా ఉన్నారని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో విద్య, వైద్యం, ఉద్యోగ నియమాకాల్లో తీవ్ర అన్యాయం జరిగిందని, 14ఏళ్ల పోరాటం అనంతరం స్వరాష్ట్రం ఏర్పడ్డాక టీఆర్‌ఎస్ అధినేత, సీఎం అన్ని వర్గాల అభ్యున్నతికి అహర్నిషలు కృషి చేస్తున్నారన్నారు. నిరుపేద, మధ్య తరగతి అభ్యర్థులకు హైదరాబాద్‌కు వెళ్లి వివిధ పోటీ పరీక్షలకు సిద్ధం కావాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న విషయం అన్నారు. అలాంటి వారి కోసం జిల్లాలో స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేసి ఉచితంగా భోజన వసతితో పాటు శిక్షణను ఇస్తున్నామని చెప్పారు. వివిధ ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగాల కోసం సుమారు 700 మంది ఎంపికయ్యారన్నారు. రాష్ట్రంలోనే ఆదిలాబాద్ జిల్లాలో రూ.20 కోట్లతో జైనథ్ మండలంలో నిర్మించిన బీసీ గురుకులం పాఠశాల త్వరలో ప్రారంభం కానుందన్నారు. ఎస్సీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్లు ఉన్నాయని, వీటితో పాటు విశ్వబ్రాహ్మణ, వైశ్య, రెడ్డి కులస్తుల్లో కూడా నిరుపేదలు ఉన్నారని, వారిని ఆర్థికంగా ఆదుకొనేందుకు కార్పొరేషన్లు ఏర్పాటు చేశామన్నారు.

త్వరలో మైనార్టీ, ఎస్టీ స్టడీ సర్కిళ్ల ఏర్పాటు ..
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మైనార్టీ, ఎస్టీ స్టడీ సర్కిళ్లను పక్క భవనాలతో ఏర్పాటు చేసేందుకు సీఎం కృషి చేస్తున్నారన్నారు. ఇది వరకే ఎస్సీ, బీసీ స్టడీ సర్కిళ్లు కొనసాగుతున్నాయని, వీటి మాదిరిగా మైనార్టీ, ఎస్టీ సర్కిళ్లను ఏర్పాటు చేసి నిరుద్యోగ అభ్యర్థులకు శిక్షణ ఇస్తామన్నారు. మైనార్టీ బాలిక, బాలుర పక్క భవనాలను రూ.2.20 కోట్లతో నిర్మిస్తామని చెప్పారు. వీటితో పాటు మైనార్టీ రెసిడెన్షియల్‌లో భవనాలను త్వరలోనే స్థలాలు చూసి పనులను కూడా ప్రారంభిస్తామన్నారు. అభ్యర్థులు ఇష్టపడి చదివి మంచి ఉద్యోగాలు సాధించే దిశగా ప్రయత్నాలు చేయాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యేకు స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్‌కుమార్, డీబీసీడీవో ఆశన్న పుష్పగుచ్ఛం అందజేసి శాలువ కప్పి సన్మానించారు. స్టడీ సర్కిళ్లలో శిక్షణ ఇస్తున్న వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని ఎమ్మెల్యేకు బీసీ, ఎస్సీ స్టడీ సర్కిళ్ల నిర్వాహకులు వినతి పత్రం అందించారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ రంగినేని మనీష, డీసీసీబీ చైర్మన్ ముడుపు దామోదర్‌రెడ్డి, ఆదిలాబాద్ జడ్పీటీసీ ఇజ్జగిరి అశోక్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, ఎంబీసీ జిల్లా కమిటీ సభ్యుడు దివిటి రాజు, మావల మండల అధ్యక్షుడు నల్ల రాజేశ్వర్, వైస్ ఎంపీపీ గంగారెడ్డి, కౌన్సిలర్లు కలాల శ్రీనివాస్, ఈఈ రామకృష్ణా రెడ్డి, డిప్యూటీ ఈఈ ప్రభాకర్, బీసీ సంఘం నాయకులు ఈర్ల సత్యనారాయణ, అన్నదానం జగదీశ్వర్, ప్రమోద్‌కుమార్ ఖత్రి, నాయకులు యూనిస్ అక్బానీ, భరత్, దమ్మపాల్ తదితరులు పాల్గొన్నారు.

టీఆర్‌ఎస్ హయాంలోనే పక్కా భవనాలు..
టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే అన్ని శాఖలకు పక్కా భవనాలను నిర్మిస్తున్నామని ఎమ్మె ల్యే రామన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని సాం ఘిక సంక్షేమ సముదాయ భవనం పై అంతస్తు లో బీసీ ఆర్సీవో కార్యాలయ నిర్మాణానికి మంగళవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ప్రభుత్వ కా ర్యాలయాలు సరిగా ఉండక పోవడం, సరైన సి బ్బంది ఉండక ప్రభుత్వ వివిధ శాఖల కార్యాలయాల పక్క భవనాల ని ర్మాణం చేపడుతోందన్నా రు. గతంలో ఇక్కడ పని చేసిన ఆర్టీవో కార్యాల యం లేని విషయాన్ని తన దృష్టికి తీసుకొచ్చాడ ని, ఎస్‌డీఎఫ్ రూ.61 లక్షలతో బీసీ రీజినల్ కో-ఆర్డినేటర్ కార్యాలయం ఏర్పాటు చేస్తున్నామని తె లిపారు. అనంతరం ఎ మ్మెల్యేకు డీబీసీడీవో ఆశ న్న, ఈఈ రామకృష్ణారెడ్డి, ఆర్సీవో జయపాల్ పుష్పగుచ్ఛం అందించి శాలువ కప్పి సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ రంగినేని మనీష, డీసీసీబీ చైర్మన్ ముడుపు దామోదర్‌రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకర్, డిప్యూటీ ఈఈ ప్రభాకర్, నాయకులు యూనిస్ అక్బానీ, ఖయ్యూం, జహీర్ రంజానీ, బీసీ గురుకులాల ప్రిన్సిపాల్స్ ప్రసాద్, గంగాధర్, కౌన్సిలర్ కలాల శ్రీనివాస్ పాల్గొన్నారు.

82
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles