ప్రమాదరహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యం


Tue,February 12, 2019 11:04 PM

ఆదిలాబాద్ అర్బన్, నమస్తే తెలంగాణ : ఆదిలా బాద్‌ను ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యమని కలెక్టర్ దివ్యదేవరాజన్ అన్నారు. మంగళవా రం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా వాల్‌పోస్టర్లను రవాణాశాఖ, పోలీసు అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి వ్యక్తికి మోటారు వాహనం అవసరం తప్పని సరి అయిందని, ప్రస్తుత పరిస్థితిని గమనిస్తే ప్రతి కుటుంబంలో కనీసం రెండు వాహనాలకు త క్కువగా ఉండడం లేదన్నారు. పోటీతత్వ సమాజం లో బాధ్యతా రహిత ప్రవర్తన, రహదారి నియమాలను పాటించక పోవడం, ట్రాఫిక్ సిగ్నల్ జంప్, అవగాహన లోపంతో ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తు చేశారు. ఈ ప్రమాదాల్లో ఎందరో మం ది ప్రజలు మృత్యువాత పడుతున్నారని పేర్కొన్నా రు. రాష్ట్రంలో 20వేల ప్రమాదాలు సంభవిస్తే అం దులో ఆరు వేల మంది మృతిచెందగా.. 20వేలకు మించి తీవ్రగాయాలవుతున్నాయన్నారు. ఈ ప్రమాదాలను అరికట్టడానికి సడక్ సురక్ష జీవన్ రక్ష అనే నినాదంతో జాతీయ రహదారి భద్రత వారోత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. రహదారి భద్రతా నియమాలను సక్రమంగా పాటించడమే ప్రమాదాల నివారణకు మార్గమని తెలిపారు. ఎస్పీ విష్ణువారియర్, ఎంవీఐ డి.శ్రీనివాస్, డీఎస్పీలు నర్సింహారెడ్డి, వెంకటేశ్, ఏఎంవీఐలు మహేశ్, సురేశ్, రామారావు, పోలీసు, రవాణా శాఖ అధికారులు, రాజకీయ ప్రతినిధులు పాల్గొన్నారు.

100
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles