హైరిస్క్ కేసులను ముందే గుర్తించండి

Tue,February 12, 2019 11:04 PM

-కలెక్టర్ దివ్యదేవరాజన్
-మెడికల్ ఆఫీసర్లతో సమావేశం
-తల్లి పిలుపు కాల్ సెంటర్ ట్రయల్ రన్ ప్రారంభం
ఎదులాపురం : గర్భిణులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రసవాలు చేయాలని కలెక్టర్ దివ్యదేవరాజన్ అన్నారు. మంగళవారం డీఎంహెచ్‌వో కార్యాలయంలో తల్లి పిలుపు కాల్ సెంటర్ ట్రయల్ రన్‌ను ప్రారంభించారు. కాల్‌సెంటర్ పనితీరు ఎలా ఉంది, ఫోన్‌లో గర్భిణులతో ఆశ కార్యకర్తలు ఏ విధంగా మాట్లాడుతున్నారని అడిగి తెలుసుకున్నారు. ప్రతి మూడు నెలలకు ఆల్ట్రా సౌండ్ క్రమం తప్పకుండా చేయించుకుంటున్నా రా లేదా అనే వివరాలను తెలుసుకోవాలన్నారు. గర్భం దాల్చిన నాటి నుంచి ప్రసవం సమయం వరకు వా రి పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. హైరిస్క్ కేసులు ఉంటే వారం రోజుల ముందే రిమ్స్‌కు లేదా ఉట్నూర్‌లో ని సీఎన్‌సీకు పంపించాలని సూచించారు. ఈ విషయాన్ని సంబంధిత మెడికల్ ఆఫీసర్‌కు తెలియపర్చాలన్నారు. ప్రైవేట్ దవాఖానలో ఈ-బర్త్ పోర్టల్‌ను కచ్చితంగా అమలు చేయాలన్నారు. పిల్లలు పుట్టిన వెంటనే ఈ-బర్త్‌లో వివరాలను నమోదు చేయించాలని తెలిపారు. ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలను ప్రోత్సహించి ప్రతి ఒక్కరికీ కేసీఆర్ కిట్ అందించాలన్నారు. తల్లి పిలుపు కాల్‌సెంటర్ రాష్ట్రంలో ఎక్కడా లేదని ఆదిలాబాద్ డీఎంహెచ్ వో ఆలోచనా విధానంతో ఈ సెంటర్‌ను ఏర్పా టు చేయడం అభినందనీయం అన్నారు.

మెడికల్ ఆఫీసర్లు సమయ పాలన పాటించాలి..
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో విధులు నిర్వహిస్తు న్న మెడికల్ ఆఫీసర్లు సమయపాలన పాటించాలని కలెక్టర్ సూచించారు. పీహెచ్‌సీలకు వచ్చే రోగులకు నాణ్యమైన వైద్యసేవలందించాలన్నారు. గర్భి ణులపై ప్రత్యేక దృష్టి సారించి వైద్య పరీక్షలను నిర్వహించాలన్నారు. ప్రభుత్వ వైద్యశాలల్లోనే మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయనే నమ్మకాన్ని పేద ప్రజల్లో కల్పించేందుకు కృషి చేయాలన్నారు. ప్రసవాలకు ప్రైవేట్ దవాఖానలకు వెళ్లకుండా చూడాలన్నారు. మెడికల్ ఆఫీసర్లు వెంటనే గ్రూప్ క్రియేట్ చేసి అన్ని విషయాలు అందులో పోస్టు చేయాలన్నారు. విధులకు ఎవరు వస్తున్నారు.. ఏదైనా సమయంలో లేక పోయినా ఆ విషయాన్ని అందులో ఎప్పటికప్పుడు పోస్టు చేయాలన్నారు. పీహెచ్‌సీకి వచ్చే రోగులకు వైద్యుడు ఏ సమయంలో అందుబాటులో ఉంటాడో.. లేదో ముందుగానే తెలియజేయాలన్నారు. కొన్ని సందర్భాల్లో గ్రామ, మండలాలను సందర్శించిన సమయంలో పీహెచ్‌సీలో వైద్యులు ఉండడం లేదని, రావడం లేదని ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఇకపై మెడికల్ ఆఫీసర్లు సమయపాలన పాటించక పోతే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌వో రాజీవ్‌రాజ్, డిప్యూటీ డీఎంహెచ్‌వో సాధన, అడిషనల్ డీఎంహెచ్‌వో శోభపవార్, తదితరులు పాల్గొన్నారు.

89
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles