జీవాలకు వరం.. సంచార వైద్యం

Tue,February 12, 2019 11:04 PM

-1962కు కాల్ చేస్తే స్పందిస్తున్న అధికారులు
-ఈ ఏడాది 3379 పశువులకు చికిత్స
ఆదిలాబాద్ అర్బన్, నమస్తే తెలంగాణ : ప్రభు త్వం ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన పశు ఆరోగ్య సేవ (1962) అంబులెన్స్‌లు మూగజీవాలకు వ రంగా మారాయి. పైలట్ ప్రాజెక్టుగా గత ఏడాది అక్టోబర్‌లో ఈ సేవలను ప్రభుత్వం ప్రారంభించింది. వ్యాధులు, ప్రమాదాల బారిన పడినా 1962 నంబర్‌కు ఫోన్ చేస్తే చాలు పశువులు ఉన్న చోటికే ఈ అంబులెన్స్‌లు వెళ్లి సేవలందిస్తున్నా యి. నూతన ఆదిలాబాద్ జిల్లాకు రెండు వాహనాలను ప్రభుత్వం కేటాయించింది. ఆదిలాబాద్, బోథ్ నియోజక వర్గాల్లో ఒక్కో వాహనం అందుబాటులో ఉంచి సేవలను ప్రారంభించారు. ఏడా ది కాలంగా సంచార వైద్యశాల 3379 పశులకు సత్వర చికిత్సలను అందజేసి ప్రాణాలను కాపాడింది.

1962 నంబర్‌కు ఫోన్ చేస్తే చాలు..
పశువులు అనారోగ్యం బారిన పడిన, ఏదైనా ప్రమా జరిగినా సమీపంలోని పశువైద్యశాలకు రైతులు తరలించేవారు. వాహనాలు లేదంటే ఎడ్ల బండ్లలో తీసుకెళ్లాల్సి ఉండేది. కిలో మీటర్ల దూ రంలో ఈ పశువైద్యశాలలు ఉన్నాయి. ప్రమాదాల బారిన పడిన జీవాలను చికిత్స కోసం తరలిస్తున్న సమయంలో వైద్యం అందక మృత్యువాత పడ్డ సంఘటనలు ఉన్నాయి. మరికొన్ని జీవాలు ప్రసవించే సమయంలో దూడలు అడ్డం తిరిగి కడుపులోనే చనిపోయి జీవాలు తీవ్ర ఇబ్బందులు పడేవి. మూగజీవాలను కాపాడేందుకు రాష్ట్ర ప్ర భుత్వం సత్వర వైద్య సేవలను అందుబాటులోకి తీసుకవచ్చింది. సంచార వైద్యశాల వాహనాలను జిల్లాకు రెండు కేటాయించారు. 1962టోల్‌ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తీసుకవచ్చి హైదరాబాద్‌లో కంట్రోల్ రూంకు అనుసంధానం చేశా రు. రైతులు ఈ టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేయగానే ఊరు, పేరు అడిగి తెలుసుకుంటారు. చెప్పగానే ఆయా నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన సెంటర్‌కు కాల్‌డైవర్ట్ చేస్తారు. ఆ తర్వాత ఇక్కడి సిబ్బంది పూర్తి వివరాలను తెలుసుకొని నమోదు చేసుకుంటారు.

ఆ వెంటనే అవసరమైన మందులను అంబులెన్స్‌లో ఉంచి గ్రామాలకు వెళ్లి పశువులకు అవసరమైన సేవలన్నీ ఈ అంబులెన్స్‌ల ద్వారా అందిస్తున్నారు. ఇప్పటి వరకు 3379 మూగ జీవాలకు చికిత్సలను అందజేశారు. ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాల్లో ఏడాది కా లంగా పశువుల ఆరోగ్య సేవ అంబులెన్స్ సేవల ను మూగజీవాలకు సత్వర వైద్య చికిత్సలు అందజేసి ప్రాణం పోస్తున్నాయి.

రైతులకు తప్పిన ఇబ్బందులు..
అంతరించి పోతున్న పశు సంపదను కాపాడేందు కు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పశువులకు సత్వర సేవలను అందించడానికే 1962 వాహన సేవలను అందుబాటులోకి తీసుకు వచ్చింది. మనుషులకు సత్వర సేవలను అందించడానికే 108 అంబులెన్స్ మాదిరిగానే పశువులకు కూడా 1962 నంబర్‌కు రైతులు కాల్ చేయగానే సంచార వైద్యశాల వాహనం ద్వారా సత్వర సేవలను అందిస్తున్నారు. రైతులు ఫోన్ చేయగానే గ్రామాలకు వెళ్లి పశువులకు అన్నిరకాల వైద్య సేవలతో పాటు శస్త్ర చికిత్సలను సైతం చేస్తున్నారు. ఘటన స్థలాల వద్ద చికిత్స చేయడానికి అనువుగా లేని పక్షంలో జిల్లా కేంద్రంలోని ప్రధాన పశువైద్య శాలకు వాహనంలో తీసుకు వచ్చి చికిత్సలు అందజేస్తున్నారు. ఈ ఏడాది కాలంగా ఇప్పటి వరకు 3379 పశువులకు సత్వర చికిత్సలు అందజేసి ప్రాణాలు కాపాడారు. ఈ సేవలు అందుబాటులోకి రావడంతో పశువులకు ఎలాంటి సమస్యలు వచ్చినా చికిత్స కోసం పశువైద్య కేంద్రానికి తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా పోయింది. పశువులు ఉన్న స్థలానికే వాహనం వచ్చి సేవలందిస్తుండగా.. అన్న దాతల్లో హర్షం వ్యక్తం అవుతోంది.

96
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles