అభివృద్ధి చేశాం.. ఆదరించండి

Tue,November 20, 2018 12:00 AM

జైనథ్ : ఆదిలాబాద్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంతో పాటు అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి కృషిచేశామని, ఈ ఎన్నికల్లో తమకు ఓటు వేసి ఆదరించాలని రాష్ట్ర మంత్రి జోగురామన్న కోరారు. మండలంలోని పూసాయి, పిప్పర్‌వాడ గ్రామాల్లో సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ చేసిన అభివృద్ధిని వివరిస్తూ ప్రచారం నిర్వహించారు. అవ్వ నీకు పింఛన్ వస్తోందా? అని వృద్ధులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... తెలంగాణ రాష్ట్రం దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు. అర్హులైన వారికి డబుల్‌బెడ్‌రూం నిర్మించి ఇస్తామన్నారు. రూ. వెయ్యి ఆసరా పింఛన్ రూ.2016కు పెంచుతామన్నారు. రైతు బంధు ఆర్థిక సహాయాన్ని రూ.8 వేల నుంచి రూ.10వేలకు పెంచుతామన్నారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కింద ప్రతినెలా రూ. 3016 అందిస్తామన్నారు.

మహాకూటమి నాయకులు మాయమాటలు చెప్పి రూ.2 లక్షల రుణమాఫీ అని గ్రామాల్లోకి వస్తారని... వారికి ఓటుతో గుణపాఠం చెప్పాలన్నారు. ఎన్నికల అనంతరం రూ.లక్ష ఒకేసారి రుణమాఫీ చేస్తామన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి కృషిచేస్తోందన్నారు. వారి కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నామన్నారు. అంతకు ముందు ఆయా గ్రామాల్లో మంత్రికి గ్రామస్తులు పూలతో స్వాగతం పలికారు.

టీఆర్‌ఎస్‌లో చేరిన బెల్లూరి గ్రామస్తులు..
మండలంలోని బెల్లూరి గ్రామానికి చెందిన పి.ఆశారెడ్డి ఆధ్వర్యంలో 50 మంది యువకులు మంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. వారి మంత్రి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ,అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై ప్రజలు టీఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నారన్నారు. ప్రజలు టీఆర్‌ఎస్ పార్టీకి ఓటు వేసి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మండల నాయకులు తల్లెల చంద్రయ్య, ఆర్‌ఎస్‌ఎస్ కన్వీనర్ లింగారెడ్డి, ఏఎంసీ చైర్మన్ ప్రభాకర్, మండల అధ్యక్ష, కార్యదర్శులు తుమ్మల వెంకట్‌రెడ్డి, ఊశన్న, ఈజీఎస్ కమిటీ మెంబర్ అశోక్, స్థానిక నాయకులు సురేందర్‌రెడ్డి, భోజన్న, రమేశ్, మల్లారెడ్డి, ప్రశాంత్ రెడ్డి, విలాస్, రాజారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, ఆయా గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

236
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles